మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్ చిరుత సినిమాతో రామ్ చరణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. చిరంజీవి తనయుడు కావడంతో అభిమానులు, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిరుత సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత రామ్ చరణ్ మగధీర సినిమాతో వచ్చే రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ సినిమా దెబ్బకు రామ్ చరణ్ స్టార్ హీరోగా ఎదిగాడు.
Advertisement
తన నటన, డ్యాన్స్ తో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక కెరీర్ లో ఎదుగుతున్న నేపథ్యంలోనే, అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాడు చరణ్. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఫ్యామిలీకి, అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉంది. 2012 జూన్ 14న రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగింది.
Advertisement
అయితే, పెళ్లయి పదేళ్లు అవుతున్న వీరిద్దరికీ పిల్లలు లేరు. దీంతో మెగా ఫ్యామిలీని చాలా మంది ట్రోల్ చేశారు. అయినా వాటిని ఈ జంట పట్టించుకోలేదు. ఇక ఇది ఇలా ఉంచితే, మెగా అభిమానులందరికీ శుభవార్తని అందించారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రాంచరణ్-ఉపాసన వివాహం 2012లో జరిగింది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో మెగా అభిమానులంతా రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022
READ ALSO : బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?