Home » రామ్ చరణ్ కొత్త డైరెక్టర్ పై క్లారిటీ..!

రామ్ చరణ్ కొత్త డైరెక్టర్ పై క్లారిటీ..!

by Azhar
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించగా.. పాన్ ఇండియా లెవల్ లో ఇది విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. అందుకే రామ్ చరణ్ తర్వాతి సినిమా మళ్ళీ ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు అనేది తెలిసిందే.

Advertisement

అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ అనేది పెట్టలేదు. కానీ ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15వ సినిమాగా వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో తీస్తాడు అనే చర్చ ఇన్ని రోజులు జరుగుతూ వచ్చింది. అందులో మొదట జెర్సీ డైరక్టర్ అయిన గౌతం తిన్ననూరితో రామ్ చరణ్ తన 16వ సినిమా అనేది చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వారి కాంబినేషన్ లో సినిమా అనేది రావడం లేదు.

Advertisement

ఎందుకో తెలియదు కానీ రామ్ చరణ్ ఆ సినిమాను ఆపినట్లు తెలుస్తుంది. దాంతో రామ్ చరణ్ 16వ సినిమా డైరెక్టర్ మళ్ళీ మారిపోయారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ తన 16 సినిమాను కన్నడ దర్శకుడు నార్తన్ తో కలిసి చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయన ఇప్పటివరకు కేవలం ఒక్క సినిమా మాత్రం తీశారు. కాబట్టి నార్తన్ చరణ్ తో తీసే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఒక్క సెంచరీతో విరాట్ రికార్డుల పర్వం..!

ఈ సెంచరీ వారికే అంకితం..!

Visitors Are Also Reading