Home » ఆరెంజ్ త‌ర‌వాత నిర్మాత‌లెవ‌రూ ద‌గ్గ‌ర‌కు రాలేదు..రామ్ చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్..!

ఆరెంజ్ త‌ర‌వాత నిర్మాత‌లెవ‌రూ ద‌గ్గ‌ర‌కు రాలేదు..రామ్ చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్..!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో హిట్స్ ఉన్నంత‌కాల‌మే ఎవ‌రికైనా క్రేజ్ ఉంటుంది. అది న‌టీన‌టులు అయినా ద‌ర్శ‌కులు అయినా….ఒక్క ఫ్లాప్ పండిందంటే నిర్మాత‌లు ద‌గ్గ‌ర‌కు కూడా రారు అనేది ఇండ‌స్ట్రీ ఎరిగిన సత్యం. ఎంత‌టి స్టార్ హీరో అయినా అలాంటి ప‌రిస్థితుల‌ను ఎదురుకోవాల్సి వ‌స్తుంది. ఇక చిరంజీవి న‌ట‌వార‌సుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైంద‌ట‌. చిరుత సినిమాతో రామ్ చ‌ర‌ణ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

also read : VIDEO : మేన‌ల్లుడితో క‌లిసి నాగ‌బాబు కండ‌ల‌ ప్ర‌దర్శ‌న‌..వీడియో వైర‌ల్…!

Advertisement

ramcharan

ramcharan

ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేదు. కానీ మ‌గ‌ధీర సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇలాంటి భారీ విజ‌యం త‌ర‌వాత చ‌ర‌ణ్ నుండి ప్రేక్ష‌కులు మ‌రో సూప‌ర్ హిట్ ప‌డుతుంద‌ని అనుకున్నారు. కానీ మ‌గ‌ధీర త‌ర‌వాత‌ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఆరెంజ్ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది.

Advertisement

ఈ సినిమాతో నాగ‌బాబుకు భారీగా న‌ష్టాలు వ‌చ్చాట‌. ఈ చిత్రం చాలా మందికి ఫేవ‌రెట్ గా నిలిచిన‌ప్ప‌టికీ థియేట‌ర్ల‌లో మాత్రం డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేందుకు నిర్మాత‌లు బ‌య‌ప‌డ్డార‌ట‌. ఈ విష‌యాన్ని చ‌ర‌ణ్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఆరెంజ్ ఫ్లాప్ త‌ర‌వ‌త నిర్మాత ఆర్మీ చౌద‌రి ముందు త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి సినిమా చేయాలని కోరిన‌ట్టు తెలిపారు.

ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని అన్నారు. ఆయ‌న అంటే త‌న‌కు ఎంతో గౌర‌వ‌మ‌ని అన్నారు. అంతే కాకుండా తాను ఎప్పుడూ ఇలాంటి ద‌ర్శ‌కుడితోనే సినిమా చేయాల‌ని కూడా ఎప్పుడూ అనుకోలేద‌ని అన్నారు. ఎవ‌రు వ‌చ్చినా అంగీర‌క‌రించాన‌ని చెప్పారు. ఇక ఇప్పుడు చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్ లో ప‌రిచ‌యం కాబోతున్నారు. ఈ సినిమా ఎలాంటి విజ‌యం సాధిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading