సెలబ్రెటీల వద్ద పనిచేసే డ్రైవర్ లను బౌన్సర్ లను ఇంటి పనివారిని సొంతమనుషుల్లా చూసుకుంటారు. ముఖ్యంగా ఎప్పుడూ తమ వెంటే ఉండే తమ డ్రైవర్లు మరియు బౌన్సర్ లకు ఎంతో క్లోజ్ గా అవుతారు కూడా. అదే విధంగా పండగలు పుట్టినరోజులకు వారికి గిఫ్ట్ లు ఇస్తూ సెలబ్రెటీలు సంతోషపెడతారు. అదే విధంగా ఎప్పుడూ తమకు అండగా ఉండే వారికి సాలరీలు కూడా గట్టిగా ఇస్తుంటారు.
పలువురు బాలీవుడ్ సెలబ్రెటీల వద్ద పనిచేసే వారి జీతాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువని పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మన టాలీవుడ్ తారల వద్ద పనిచేసే వారి జీతాలు కూడా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. తాజాగా హీరో రామ్ చరణ్ తన డ్రైవర్ కు ఇచ్చే జీతం గురించి సోషల్ మీడీయాలో చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ తన వద్ద పని చేసే పనివాళ్లని మార్చడానికి ఇష్టపడరట.
Advertisement
Advertisement
లాక్ డౌన్ వేళ కూడా పనిలేకపోయినా సిబ్బందికి జీతాలు ఇచ్చి వారిని ఆదుకున్నారట. ఇక రామ్ చరణ్ తన డ్రైవర్ కు కూడా మంచి జీతాన్ని ఇస్తారట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారంగా రామ్ చరణ్ వద్ద పనిచేస్తున్న డ్రైవర్ జీతం నెలకు రూ.45 వేల వరకూ ఉంటుందట. ఇది ఓ సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీతంతో సమానమే చెప్పాలి. సాఫ్ట్ వేర్ కొలువులోనూ ప్రారంభంలో రూ.20 వేల నుండి రూ.30 వేల వరకూ మాత్రమే ఉంటాయి.
అంటే రామ్ చరణ్ డ్రైవర్ సంపాదన అంతకంటే ఎక్కువనే చెప్పాలి. ఇక జీతంతో పాటూ చరణ్ అతడికి బోనస్ లు కూడా ఇస్తుంటాడట. ఇదిలా ఉంటే రామ్ చరణ్ రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాతో పాటూ చరణ్ ఆచార్యలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది.