Home » హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసిన రామ్ చరణ్…!

హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసిన రామ్ చరణ్…!

by Bunty
Ad

 

బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు క్రికెట్ లో సత్తా చాటెందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగా చెర్రీ హైదరాబాద్ టీం ను కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. క్రికెట్ స్వరూపాన్నే మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫారెన్ ప్లేయర్స్ ను మిక్స్ చేసుకొని ఒక జట్టుగా ఆడించడం బీసీసీఐకి చెల్లింది. ఈ లీగ్ ద్వారా బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా అవతరించింది.

Advertisement

అనంతరం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వచ్చింది. ఇది కూడా సక్సెస్ అయ్యింది. అయితే….ఇప్పుడు కొత్తగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఐఎస్పిఎల్ పేరుతో మరోకొత్త లీగ్ సందడి చేయనుంది. గల్లి క్రికెట్ కు, స్టేడియంలో జరిగే ప్రొఫెషనల్ ఆటకు మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చేందుకు ఐఎస్పిఎల్ ప్రారంభమయ్యింది. ఐఎస్పిఎల్ అంటే ఐపీఎల్ కాదు. ఇది ఒక గల్లీ క్రికెట్ లీగ్. గల్లీల్లో ఉండే టాలెంట్ ను గుర్తించి ఈ లీగ్ ద్వారా వారికి అవకాశం కల్పిస్తుంది. ఈ లీగ్ టీ10 ఫార్మాట్లో జరుగుతుంది. 2024 మార్చి 2 నుంచి 9వ తేదీ వరకు ఐఎస్పిఎల్ మ్యాచ్ లు జరుగుతాయి.

మొత్తం 19 మ్యాచ్లు ముంబైలోనే జరగనున్నాయి. ఇందులో చేరాలంటే అన్ని రాష్ట్రాల క్రికెటర్స్ ఈ లీగ్ సెలక్షన్స్ లో పాల్గొనవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా www.ispl-T10.com వెబ్సైట్ లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి తదితర వివరాలు నమోదు చేసి 1179 రూపాయలు కట్టి రిజిస్టర్ అవ్వాలి. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ ముంబై జట్టును కొనుగోలు చేశాడు. హృతిక్ రోషన్ బెంగుళూరు, అక్షయ్ కుమార్ శ్రీనగర్ జట్లను కొనుగోలు చేశారు. తాజాగా వీరి జాబితాలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కూడా చేరిపోయాడు.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading