Home » Ram Charan : రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్దదో తెలుసా..!

Ram Charan : రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్దదో తెలుసా..!

by Bunty
Ad

 

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్. చిరుత సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే అభిమానులను మెప్పించారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన జంట గురించి తెలియని వారుండరు. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు అయిన ఉపాసనతో ఐదేళ్లపాటు ప్రేమాయణం నడిపించిన రామ్ చరణ్ 2012లో పెద్దల అంగీకారంతో ఆమెను వివాహం చేసుకున్నాడు. రామ్ చరణ్ టాప్ హీరో నుంచి గ్లోబల్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Advertisement

Advertisement

మరోవైపు అపోలో హాస్పిటల్స్ లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతలను తీసుకుంది ఉపాసన. అలాగే సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా తన సత్తా చాటుతోంది. ఉపాసన, రాంచరణ్ దారులు వేరైనప్పటికీ అభిరుచులు ఒకటి కావడంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్దదో తెలిస్తే షాక్ అయిపోతారు.

ఎందుకంటే వీరిద్దరి మధ్య నాలుగేళ్ల ఏజ్ గ్యాప్ ఉందట. రామ్ చరణ్ కన్నా ఉపాసన నాలుగేళ్లు పెద్దది అయినప్పటికీ ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కాగా, వివాహం జరిగిన పదేళ్లకు ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారు. ఇటీవల గర్భం దాల్చిన ఉపాసన మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. తాజాగా దుబాయ్ లోని నమ్మోస్ బీచ్ క్లబ్ లో ఉపాసన బేబీ షవర్ వేడుక ఘనంగా జరిగింది.

Visitors Are Also Reading