Home » చిరు నో చెప్పిన తర్వాత చేసి ప్లాప్ తెచ్చుకున్న రామ్ చరణ్..!

చిరు నో చెప్పిన తర్వాత చేసి ప్లాప్ తెచ్చుకున్న రామ్ చరణ్..!

by Azhar
Ad

సినిమా ప్రపంచంలోని ప్రస్తతం ఎక్కువగా వారసులే వస్తున్నారు అనే విషయం తెలిసిందే. సొంతంగా కష్టపడి వచ్చిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే గతంలో ఎలా వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఉంటారు. ఒక్కడిగా వచ్చిన ఆయన.. మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన పేరుతో టాలీవుడ్ లోకి వచ్చిన హీరోలలో ఆయన కొడుకు అయిన రామ్ చరణ్ కూడా ఉంటాడు.

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్న రామ్ చరణ్.. ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ అనే సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన తన కెరియర్ లోని 15వ సినిమా అనేది శంకర్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇక గతంలో ఆయన చేసిన సినిమాలో ప్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ అందులో ఓ సినిమాను చిరంజీవి వద్దు అన్న తర్వాత కూడా రామ్ చరణ్ చేసి ప్లాప్ ను ఖాతాలో వేసుకున్నారు అని తెలుస్తుంది.

Advertisement

 

అయితే ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా లెవల్ లో విడుదల కావడంతో హిందీలో కూడా రిలీజ్ అయ్యింది. కానీ గతంలోనే రామ్ చరణ్ తుఫాన్ అనే సినిమా ద్వారా హిందీలో ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా కథ విన్న తర్వాత వద్దు అని చిరు చెప్పినా కూడా.. హిందీలో ఎంట్రీ అవుతుంది అని రామ్ చరణ్ ఒప్పుకున్నాడు అని తెలుస్తుంది. కానీ అది పెద్ద డిజాస్టర్ అయిన సంగతి కూడా తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

భారత్ ను అవమానించేలా పాక్ వ్యాఖ్యలు.. హెల్మెట్ అవసరం లేదని..?

ఖుషిలో కోహ్లీ ఫ్యాన్స్.. ఫామ్ లోకి వచ్చాడు అని కాదు..!

Visitors Are Also Reading