Home » ఎంత మందితో అయిన నేను సిద్ధం అంటున్న రకుల్..!

ఎంత మందితో అయిన నేను సిద్ధం అంటున్న రకుల్..!

by Azhar
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంటుంది. మొదట వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు అభిమానులకు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా చాలా త్వరగా ఎదిగింది. తెలుగులో ఉన్న అందరూ స్టార్ హీరోలతో పనిచేసిన రకుల్.. ఆ తర్వాత తమిళ్. కన్నడ భాషల్లో కూడా నటించింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు తెలుగు కంటే ఎక్కువగా బాలీవుడ్ పైన తన దృష్టి అనేది పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది.

Advertisement

అయితే హిందీలో ఈ అమ్మడుకు అవకాశాలు అనేవి వస్తున్నాయి.. కానీ అక్కడ హిట్ అనేది అందుకోలేకపోతుంది. ఇక ఈ మధ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ అనేవి చేసింది. రకుల్ మాట్లాడుతూ… నేను ఒక్క వ్యక్తిగా చాలా బలంగా ఉంటాను. అయితే యాక్టర్ కావాలనే నేను నా ప్రయాణాని ప్రారంభించాను. ఎన్ని అడ్డంకులు వచ్చిన నేను ఆత్మవిశ్వసంతో ముందుకు వెళ్ళాను. ఇక ఇప్పుడు కూడా అదే ఆత్మవిశ్వసంతో నేను ఉన్నాను. హీరోయిన్ గా ఇంకా మంచి సినిమాలు చేస్తూ ఎదగాలని ఆలోచిస్తున్నాను.

Advertisement

ఇక ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా పట్ల నేను సంతోషంగానే ఉన్నాను. ఆ విషయంలో ఎటువంటి రిగ్రెట్స్ అనేవి నాకు లేవు. అయితే నేను ఎంత మంది హీరోలు, హీరోయిన్స్ ఉన్న సినిమాలో అయిన నట్టించడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే.. అంతమంది ఉన్నప్పుడు ఎవరి పాత్ర అనేది వారికీ ఉంటుంది. అలాగే ఎవరి ప్రత్యేకత అనేది వారికే ఉంటుంది అని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది. ఇక ఈ మధ్య ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ప్లాప్ కావడంతో తెలుగులో అవకాశాలు అనేవి తగ్గిపోయాయి. కానీ హిందీలో మాత్రం ఇంకా నెట్టుకు రావడానికి రకుల్ ప్రీత్ సింగ్ ప్రయత్నిస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. 45 ఏళ్ల రికార్డు బ్రేకు..!

ఈ ఏడాది 7వ కెప్టెన్ గా ధావన్…!

Visitors Are Also Reading