Home » ఏఎన్ఆర్ వదిలేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్..

ఏఎన్ఆర్ వదిలేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్..

by Azhar
Ad

సినిమా ఇండస్ట్రీలో ఒ హీరో చేయాల్సిన సినిమా.. ఓ హీరో వదిలేసిన మరో చేయడం.. అది సూపర్ హిట్ కావడం చాలా మాములు విషయం. ఈ మధ్య కాలంలో అలా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఇటువంటి సినిమాలు ఇప్పుడు కాదు.. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రారంభమైనప్పటి నుండి ఉంది. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు తెలుగు సినిమాకు రెండు కళ్ళలాంటి వారు. ఈ ఇద్దరు చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఎ కారణాలతోనైనా కానీ.. వీరు వదిలేసిన కొన్ని సినిమాలు వేరే హీరోలు చేసి సూపర్ హిట్ అందుకున్నారు.కానీ ఏఎన్ఆర్ వదిలేసిన సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు ఎన్టీఆర్.

Advertisement

Advertisement

1961 లో తమిళ్ లో విడుదల అయిన పశమలర్ అనే సినిమా సూపర్ హిట్ కావడంతో దానిని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. అయితే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రకు మొదట ఏఎన్ఆర్ అను అనుకున్నారు. కానీ ఆ సినిమా చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే అందులో ఆయన మహానటి సావిత్రికి అన్నగా నటించాలి. దాంతో ఆయన వెనకడుగు వేశారు.

ఆ తర్వాత ఈ సినిమా ఎన్టీఆర్ చేతికి వెళ్ళింది. అయితే అప్పటికే ఎన్టీఆర్, సావిత్రి నటించిన గుండమ్మకథ సూపర్ హిట్ అయ్యింది. అయినా ఆయన వెన్నకి తగ్గకుండా.. సావిత్రికి అన్నగా చేసారు. ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెలుగా నటిస్తే ఆడుతుందో.. ఆడదో అనుకున్న ఈ సినిమా అప్పట్లో అద్భుత విజయం సాధించింది. రక్తసంబంధం పేరుతో వచ్చిన ఈ సినిమా క్లైమాక్స్ లో ఎన్టీఆర్, సావిత్రి నటించిన తీరు అభిమానులను కట్టు పడేసింది. 4 లక్షల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకు ఎన్టీఆర్ పారితోషకం 25 వేలు కాగా.. సావిత్రి పారితోషకం 20 వేలు.

Visitors Are Also Reading