Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఎన్టీఆర్ తో గొడవలపై రాజీవ్ కనకాల ఏం అంటున్నాడు..?

ఎన్టీఆర్ తో గొడవలపై రాజీవ్ కనకాల ఏం అంటున్నాడు..?

by Azhar
Ads

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అందరిలో క్లోజ్ గా ఉన్నట్లే కనిపిస్తారు. కానీ అది అంత మందిలోనో.. లేక కెమెరాల ముందు ఉనంతవరకు మాత్రమే ఉంటుంది. వెనక్కి వెళ్లిన తర్వాత మళ్ళీ అంత మాములే. కానీ ఇలాంటి వాళ్ళ మధ్యలో కూడా కొంతమంది బెస్ట్ ఫ్రెడ్స్ అనేవాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు మంచి మిత్రులు అనే విషయం మనకు మామూలుగానే అర్ధం అవుతుంది. ఇక అలాంటివారిలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల తప్పకుండ ఉంటారు. ఈ ఇద్దరు కమిలి చేసిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. అప్పటి నుండి వీరి మధ్య మంచి స్నేహం అనేది ఏర్పడింది.

Advertisement

Ad

అందుకే అప్పటి నుండి ఎన్టీఆర్ చేసే ప్రతి సినిమాలో కూడా రాజీవ్ కనకాల మనకు కనిపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ పాత్రలో కనిపిస్తాడు. అలంటి వాటిలో జనతా గ్యారేజ్ అనే సినిమా కూడా ఒక్కటి. కానీ ఈ మధ్య కాలంలో వీరి మధ్య గొడవలు వచ్చాయి అని తెగ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల పైన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన రాజీవ్ స్పందించాడు. రాజీవ్ మాట్లాడుతూ.. నాకు ఎన్టీఆర్ కు గొడవలు వచ్చాయి. అందుకే నేను ఆయన సినిమాలో కటించడం లేదు అని అంటున్నారు. కానీ మా మధ్య ఏ గొడవలు లేవు.

అయితే నేను ఎన్టీఆర్ సినిమాలో కనిపించకపోవడానికి కారణం నేను వేరే సినిమాలు కమిట్ కావడమే. నాకు ఎన్టీఆర్ కు మధ్య మంచి కంఫర్ట్ అనేది ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ నేను ప్రతి సినిమాలో ఉండేలా చూసుకుంటాడు. కొన్ని సమయంలో నా కోసం కథలో కొన్ని మార్పులు కూడా చూపిస్తాడు. కానీ నా వల్ల దర్శకులు ఇబ్బంది పడకూడదు అనే కారణంతోనే నేను ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ సినిమాల్లో కనిపించడం లేదు అని రాజీవ్ కనకాల పేర్కొన్నారు. ఇక ఈ మాటలతో ఎన్టీఆర్ రాజీవ్ ల మధ్య గొడవ అనే వార్తలు చెక్ చెప్పినట్లు అయ్యింది.

Advertisement

ఇవి కూడా చదవండి :

పుజారా @ది వరస్ట్ రికార్డ్..!

కోహ్లీ ఆడుతావా.. లేదా..?

Visitors Are Also Reading