Home » రజినీకాంత్ 14 సార్లు ఏకధాటిగా చూసిన శోభన్ బాబు సినిమా అదేనా ? ఆ సినిమా ఎందుకంత ప్రత్యేకం ?

రజినీకాంత్ 14 సార్లు ఏకధాటిగా చూసిన శోభన్ బాబు సినిమా అదేనా ? ఆ సినిమా ఎందుకంత ప్రత్యేకం ?

by AJAY
Ad

సోగ్గాడు శోభ‌న్ బాబు మ‌న మ‌ధ్య‌న లేక‌పోయినా ఆయ‌న చేసిన సినిమాలు ఇప్ప‌టికే ప్రేక్ష‌కులు చూస్తూనే ఉన్నారు. ఆ సినిమాలు చూసి ఆయ‌న్ను త‌లుచుకుంటూనే ఉంటారు. ఇక శోభ‌న్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అన్ని సినిమాలు ఒక‌వైపు శోభ‌న్ బాబు చేసిన మాన‌వుడు ధాన‌వుడు సినిమా మరొక‌వైపు. ఈ సినిమా కంటే ముందు శోభ‌న్ బాబుకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే ఉండేది. కానీ మాన‌వుడు దాన‌వుడు సినిమా శోభ‌న్ బాబును స్టార్ గా నిల‌బెట్టింది.

Advertisement

ఈ సినిమా వసూళ్ల వ‌ర్షం కురిపించి బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను హీరో రజినీకాంత్ చూశార‌ట‌. అయితే అప్పుడు రజినీకాంత్ మాత్రం హీరో కాదు. బెంగుళూరులో బ‌స్ కండ‌క్టర్ గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో తాను ఈ సినిమాను చూశానని ర‌జినీకాంత్ చెబుతుంటారు. అయితే రజినీ సినిమా చూడటం పెద్ద వింత ఏమీ కాదు కానీ ర‌జినీకాంత్ కు ఈ సినిమా తెగ న‌చ్చ‌డంతో ఏకంగా ప‌ద్నాలుగు సార్లు థియేట‌ర్ లో చూశాడ‌ట‌.

Advertisement

ఇక శోభ‌న్ బాబు న‌టించిన సంపూర్ణ రామాయ‌ణం వంద రోజులు పూర్తి చేసుకున్న రోజునే మాన‌వుడు దాన‌వుడు సినిమా విడుద‌ల‌వ్వ‌డం విశేషం. అలా విడుద‌లైన సినిమా కూడా రికార్డులు క్రియేట్ చేయడం గొప్ప‌విష‌యం. ఈ సినిమా ఇప్ప‌టి ప‌రిస్థితుల‌కు సైతం క‌నెక్ట్ అవుతుంది.

హీరో అక్క చిన్న వ‌య‌సులో మాన‌వ‌మృగాల కార‌ణంగా లైంగిక దాడికి గుర‌వుతూ ఉంటుంది. హీరో పెరిగి పెద్ద‌వాడ‌య్యాక ఉద‌యం మంచివాడిగా డాక్ట‌ర్ గా క‌నిపిస్తూ రాత్రుళ్లు మాన‌వ‌మృగాల‌ను వేటాడుతూ క‌నిపిస్తాడు. సినిమా చూస్తున్నంత‌సేపు డ‌బుల్ యాక్ష‌న్ అనిపిస్తుంది కానీ సినిమా పూర్త‌యిన త‌ర‌వాత ఇద్ద‌రూ ఒక్క‌రే అనే ట్విస్ట్ తెలిసిపోతుంది. ఈ ట్విస్ట్ అప్పటి ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేసింది. అలా వ‌చ్చిన మాన‌వుడు దానవుడు సినిమా ర‌జినీకాంత్ కే కాదు చాలా మందికి తెగ‌న‌చ్చేసింది.

Visitors Are Also Reading