Home » చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో ఇండస్ట్రీ హిట్ సాధించిన రజనీకాంత్ సినిమా ఏదంటే ?

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో ఇండస్ట్రీ హిట్ సాధించిన రజనీకాంత్ సినిమా ఏదంటే ?

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో చాలా సినిమాలు చేతులు మారుతుంటాయి. కొన్ని కథ‌ల‌ను ద‌ర్శ‌కులు ఒక హీరో కోసం అనుకుంటారు కానీ ఏదో ఒక‌కార‌ణం వ‌ల్ల ఆ హీరో సినిమాను రిజెక్ట్ చేస్తే అదే క‌థ‌తో మ‌రోహీరో వ‌ద్ద‌కు వెళుతుంటారు. ఇలా క‌థ చెబుతున్న క్ర‌మంలో ఏ హీరో సై అంటే ఆ హీరోతో తెర‌కెక్కిస్తారు. ఇక సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కెరీర్ లోనూ అలాంటి సినిమా ఒక‌టి ఉంది. ఇక్క‌డ రజినీ మ‌రో హీరో రిజెక్ట్ చేసిన క‌థ‌తో రికార్డులు క్రియేట్ చేశాడు.

Advertisement

ఇంత‌కీ ఆ సినిమా ఏంటి ఎందుకు రిజెక్ట్ చేశాడు అన్న‌ది ఇప్ప‌డు చూద్దాం. ర‌జినీ రికార్డులు క్రియేట్ చేసిన సినిమా మొద‌ట‌గా చిరంజీవి వ‌ద్దకు వెళ్లింది. ఆ సినిమా మ‌రేదో కాదు టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి రిజెక్ట్ చేసిన చంద్ర‌ముఖి సినిమా. అవును మొద‌ట చంద్ర‌ముఖి సినిమా మన మెగాస్టార్ వ‌ద్ద‌కే వ‌చ్చింది.

Read Also :  సూపర్ స్టార్ కృష్ణ. మెగా స్టార్ చిరంజీవి ల కాంబినేషన్లో రెండవ సినిమా ఎందుకు మధ్యలోనే నిలించిపోయింది ?

Advertisement

ద‌ర్శ‌కుడు ఈ సినిమా చూడాల‌ని మెగాస్టార్ కు సూచించారు. కానీ ఈ సినిమా క‌న్న‌డ వ‌ర్ష‌న్ ను చూసిన చిరంజీవి వ‌ద్ద‌నుకుని ప‌క్క‌న పెట్టారు.ఈ సినిమా మ‌లయాళ సూప‌ర్ హిట్ చిత్రం ముణిచిత్ర తాల్ కు రీమేక్ గా తెర‌కెక్కింది. ముణిచిత్ర‌లో శోభ‌న‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా హీరోగా సురేష్ గోపి న‌టించారు. ఇక ఇదే క‌థ‌తో క‌న్న‌డ‌లో 2003లో ఆప్త‌మిత్ర అనే సినిమాను తెర‌కెక్కించారు.

ఈ సినిమాలో సౌంద‌ర్య హీరోయిన్ గా న‌టించింది. ఇక ఇదే సినిమాను తెలుగు త‌మిళ భాష‌ల్లో ఏకాకాలంలో చంద్ర‌ముఖి పేరుతో తెర‌కెక్కించారు. ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్ గా న‌టించ‌గా ర‌జినీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఇక 2005లో విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. సినిమాలో జ్యోతిక న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు.

Read Also :  ఎస్పీ బాలు లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు.. ఆ ఒక్క కారణంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారా..?

Visitors Are Also Reading