Home » పాకిస్తాన్ లో రజినికాంత్.. అసలు విషయం తెలిస్తే ఆశ్యర్యపోతారు..!

పాకిస్తాన్ లో రజినికాంత్.. అసలు విషయం తెలిస్తే ఆశ్యర్యపోతారు..!

by Anji
Ad

సాధార‌ణంగా భార‌త్ అంటే పాకిస్తాన్‌కి, పాకిస్తాన్ అంటే భార‌త్‌కి ప‌డ‌ద‌నే విష‌యం అందిరికీ తెలిసిందే. అలాంటిది భార‌త్‌కి చెందిన సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ పాకిస్తాన్‌కి ఎందుకు వెళ్లార‌ని చాలా మంది ఆశ్య‌ర్య‌పోతున్నారు. వాస్త‌వానికి ఈ రజినీకాంత్‌ది పాకిస్తాన్ దేశ‌మే. అచ్చం మ‌న సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌ని పోలి ఉన్నాడు. పాకిస్తాన్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ ర‌జినీకాంత్ ఎవ‌ర‌ని అనుకుంటున్నారా.? ఇప్పుడు అస‌లు విష‌యం తెలుసుకుందాం.

Advertisement

ప్ర‌పంచంలో మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌నే అంటుంటారు. ఇది వాస్త‌వ‌మో కాదో తెలియ‌దు. కానీ సేమ్ టు సేమ్ మ‌న త‌లైవాని పోలిన మ‌నిషి పాకిస్తాన్‌లో ఉన్నారు. అత‌ని పేరు రెహ్మాత్ గాస్ ఖోరి. ర‌జినీకాంత్‌ని పోలి ఉండ‌డ‌మే కాదు.. రెహ్మ‌త్ స్టైల్‌, వేషాదార‌ణ కూడా అచ్చం అలాగే క‌నిపిస్తోంది. పాకిస్తాన్‌లో అంద‌రూ ఆయ‌న‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగ‌బ‌డుతుండ‌డం విశేషం. వాస్త‌వానికి ర‌జినీకాంత్ పాకిస్తాన్ వ‌చ్చాడ‌ని అనుకుంటూ.. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లితే అక్కడ సూప‌ర్ స్టార్ అంటూ జ‌నం పోగవుతుంటార‌ని, వారంద‌రికీ ర‌జినీకాంత్ కాద‌ని తెలిసిన త‌రువాత వారు షాక‌వుతుంటార‌ని స్వ‌యంగా రెహ్మాత్ గాస్ ఖోరినే చెప్ప‌డం విశేషం.

Advertisement

Also Read :  “ప్రేమి విశ్వనాథ్” భర్త ఎవరో తెలుసా.. ఆయన కూడా చాలా ఫేమస్..!!

ర‌జినీకాంత్ మాదిరిగా ఉన్న రెహ్మాత్ గాస్ ఖోరి పాక్తిస్తాన్ ప్ర‌భుత్వ ఉద్యోగి. అక్క‌డి క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో ఉద్యోగం చేసి ప్ర‌స్తుతం రిటైర్డ్ అయ్యారు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌య‌స్సు 62 సంవ‌త్స‌రాలు. ప‌ద‌వి విర‌మ‌ణ పొందిన త‌రువాత రెహ్మ‌త్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న‌కున్న ర‌జినీ ఫాలోయింగ్ ని పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ర‌జినీకాంత్ స్టైల్ లో ఉన్న ఫోటోల‌ను త‌రుచూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. రెహ్మాత్ గాస్ ఖోరి మీడియాతో మాట్లాడుతూ సూప‌ర్ స్టార్ రజినీకాంత్ లా ఉండ‌డం చాలా ఆనందాన్నిస్తుంది. ఇది నాకు దేవుడు ఇచ్చిన వ‌రం. నా ఫోటోల‌ను పాకిస్తాన్ ప్ర‌జ‌లే కాకుండా.. భార‌త్, బంగ్లాదేశ్, సౌదికి చెందిన వాళ్లు కూడా షేర్ చేస్తుండ‌డం చూస్తుంటే ర‌జినీకాంత్‌కి ఇంత ఫాలోయింగ్ ఉందా అని పిస్తుంది. అని తెలిపాడు. ప్ర‌స్తుతం రెహ్మాత్ గాస్ ఖోరి ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Also Read :  “పొన్నియన్ సెల్వన్ 2” విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..?

Visitors Are Also Reading