Home » ఎంత ఆస్తి ఉన్న సంతోషం లేదంటున్న సూపర్ స్టార్..!

ఎంత ఆస్తి ఉన్న సంతోషం లేదంటున్న సూపర్ స్టార్..!

by Azhar
Ad

సూపర్ స్టార్ రజినీకాంత గురించి కొత్తగా చెప్పాల్సిన వసరం లేదు. ఆయనకు ఉన్న ఫ్యన్స్ ఫాలోయింగ్ అనేది ఏ లెవల్ లో ఉంటుందో ఆయనకు కట్టించిన గుడిని చూస్తే తెలుస్తుంది. ఇలా ఒక్క హీరోకు గుడి అనేది రజినీకే మొదట జరిగింది. అంతే కాకుండా తమిళనాడులో రజినీకాంత్ సినిమా అనేది విడుదల అవుతుంది అంటే చాలా ప్రవేట్ కంపెనీలు అనేవి సెలవులు కూడా ఇస్తాయి. ఈ రెండు విషయాలను తెలుసుకుంటే చాలు ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలాగే క్రేజ్ అనేది ఏ లెవల్ లో ఉందొ చెప్పడానికి. అయితే కేవలం తమిళనాడులోనే కాకుండా.. తెలుగు, కన్నడ, హిందీ దేశమంతటా కూడా రజినీకి అభిమనులు ఉన్నారు.

Advertisement

ఇక తన సినిమా కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అనేవి అందుకున్న రజినీకాంత్… ఎంతో అభిమానులతో పాటుగా డబ్బు కూడా బాగానే సంపాదించాడు. కానీ తాజాగా ఆ డబ్బు విషయంలో రజినీకాంత్ చేసిన కామెంట్స్ అనేవి వైరల్ గా మారాయి. ఎంత ఆస్తి ఉన్న సంతోషం లేదంటూ రజినీకాంత్ పేర్కొన్నాడు. అయితే రజినీకాంత్ తాజాగా ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్నాడు. అక్కడ రజినీకాంత్ మాట్లాడుతూ.. నేను గొప్ప నటుడిని అని అందరూ అంటున్నారు. కానీ అంది ప్రశంస లేక విమర్శ అనేది నాకు తెలియడం లేదు.

Advertisement

నేను చాలా సినిమాలు చేశాను. కానీ అందులో రాఘవేంద్ర, బాబా సినిమాలే ఆత్మ సంతృప్తి ఇచ్చాయి. అయితే నేను చేసిన బాబా సినిమా తర్వాత నన్ను హిమాలయాల్లోకి వెళ్లాలని చాలా మంది ఫ్యాన్స్ చెప్పగా.. కొంతమంది ఫ్యాన్స్ వెళ్లిపోయారు కూడా. కానీ నేను మాత్రం ఇంకా సినిమాలు చేస్తున్నాను. అయితే మనిషికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. మన ఆరోగ్యం అనేది పాడైతే ఇంట్లోవాళ్ళు కూడా బాధపడతారు. ఇక నేను నా కెరియర్ లో పేరుప్రఖ్యాతలు అలాగే డబ్బు చాలానే చూసాను. కానీ అందులో పది శాతం కూడా నాకు సంతోషం, ప్రశాంతత అనేవి మాత్రం దక్కలేదు. ఎందుకంటే అవి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు అని సూపర్ స్టార్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

పాండ్య రిటైర్మెంట్ ఇస్తాడు అని చెప్పిన రవిశాస్త్రి..!

రిపోర్టర్ వింత ప్రశ్న… అద్భుతమైన సమాధానం ఇచ్చిన చాహల్..!

Visitors Are Also Reading