రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ తమ అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. బిజెపి తో పాటు మిత్రపక్షాలు ఆమెకు సపోర్ట్ ప్రకటించాయి. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ముర్ము దేవాలయానికి వెళ్లి అక్కడ చీపురు తో ఊడ్చి కడిగేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఆర్జీవీ ద్రౌపది ముర్ము పై అనుచిన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశాడు.
Advertisement
Advertisement
ఈ ట్వీట్ లో వర్మ ద్రౌపది రాష్ట్రపతి అంటే మరి కౌరవులు ఎవరీ..? పాండవులు ఎవరు అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ పై బిజేపి నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ. వర్మ ఒక వెస్ట్ ఫెలో అంటూ కామెంట్ చేశారు. ఆదివాసీ మహిళ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. అంతే కాకుండా వర్మ పై అవిడ్స్ పోలీస్ పోస్ట్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.