అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుండి ఊ అంటావా మామా ఊఊ అంటావా పాటపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. పాటపై రోజుకో వివాదం వచ్చినా ఈ సినిమాలో పాటను ప్రేక్షకులు భాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటలో లిరిక్స్ పురుషుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పురుషసంఘాలు ఏకంగా కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఇంతలోనే ఈ పాట వల్ల మరో వివాదం వచ్చి పడింది.
పుష్ప సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన దేవీ శ్రీ ప్రసాద్ ను ఓ ప్రెస్ మీట్ లో ఐటమ్ సాంగ్ ల గురించి అడగ్గా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఊ అంటామా మామా పాటను భక్తి పాటలా పాడిన దేవీ శ్రీ ప్రసాద్….ఆ తరవాత తనకు భక్తి పాటలు ఐటమ్ సాంగ్స్ రెండూ ఒకటే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో మరోసారి ఊ అంటావా ఊఊ అంటావా పాట వల్ల దుమారం మొదలైంది. ఇప్పటికే డీఎస్పీ వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండించారు.
Advertisement
Advertisement
కాగా తాజాగా బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దేవీ శ్రీ ప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేవీ శ్రీ ప్రసాద్ అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదన్నారు. దేవీ ప్రసాద్ చేసిన వ్యాక్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాజాసింగ్ అన్నారు. వెంటనే దేవీ శ్రీ ప్రసాద్ హిందువులకు క్షమాపణలు చెప్పాలంటూ వ్యాఖ్యానించాడు. అంతే కాకుండా క్షమాపణలు చెప్పకుండా దేవీ శ్రీ ప్రసాద్ బయట తిరగలేరు అంటూ రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఈ వివాదం పై దేవీ శ్రీ ప్రసాద్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.