Home » నా మరదలు తో ఫోన్ మాట్లాడుతావా అంటూ రాఘవేంద్ర రావుతో గొడవపడ్డ రాజశేఖర్…అసలేం జరిగిందంటే…?

నా మరదలు తో ఫోన్ మాట్లాడుతావా అంటూ రాఘవేంద్ర రావుతో గొడవపడ్డ రాజశేఖర్…అసలేం జరిగిందంటే…?

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో రాఘవేంద్రరావు ఒకరు. అలాగే అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో రాజశేఖర్ ఒకరు. వీరిద్దరు కూడా అలనాటి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగాను… దర్శకుడిగాను కెరియర్ను కొనసాగించారు. వీరిద్దరి కెరియర్లో అల్లరి ప్రియుడు అనే బ్లాక్ బాస్టర్ మూవీ రూపొందింది. ఈ మూవీ ద్వారా రాజశేఖర్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుండి… విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

Advertisement

ఇప్పటికి కూడా ఈ మూవీలోని పాటలు ఈ తరం ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరిస్తున్నాయి. ఈ మూవీ ద్వారా వీరిద్దరికీ మంచి పరిచయం కూడా ఏర్పడింది. దానితో వీరు చాలా కాలం పాటు మంచి స్నేహితుల్ల కొనసాగారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరికీ గొడవలు ఏర్పడ్డాయి. అవి ఏమిటి… ఎవరి వల్ల వీరిద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయో తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం రాజశేఖర్ చెన్నైలో ఉన్న సమయంలో తరచూ జీవితాన్ని కలుస్తూ ఉండేవాడట.

Advertisement

అలా వీరిద్దరూ కలుస్తూ ఉండే సమయంలో వారితో పాటు జీవిత చెల్లెలు కూడా వచ్చేదట. అలాంటి సందర్భంలో జీవిత చెల్లెలిని చూసిన రాఘవేంద్రరావు ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది… సినిమాల్లోకి వస్తే గొప్ప ఆర్టిస్ట్ అవుతుంది అని జీవిత తో చెప్పేవాడట. ఈ సందర్భంలోనే ఎవరి ద్వారానో రాఘవేంద్రరావుకు జీవిత చెల్లెలు యొక్క ఫోన్ నెంబర్ లభించిందట. దానితో సినిమాల్లో నటించొచ్చు కదా ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటావు… నువ్వు గొప్ప నటివి అవుతావు అని చెప్పేవాడట.

ఈ విషయాన్ని తెలుసుకున్న రాజశేఖర్ నా మరదలు తో రహస్యంగా ఫోన్ మాట్లాడతావా అంటూ రాఘవేంద్రరావు తో గొడవకు దిగాడట. ఆ గొడవ చాలా పెద్దది కూడా అయ్యిందట. ఆ తర్వాత అసలు నిజం తెలుసుకున్న రాజశేఖర్… రాఘవేంద్రరావుకు క్షమాపణలు కూడా చెప్పాడట. కానీ వాస్తవాలను తెలుసుకోకుండా గొడవకు దిగడంతో రాఘవేంద్రరావు మాత్రం రాజశేఖర్ ను క్షమించలేదట. ఇప్పటికి కూడా ఆ కారణంతో వీరిద్దరి మధ్య మాటలు లేవంట.

Visitors Are Also Reading