Home » స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి సినిమాకు ఫ‌స్ట్ ఆప్ష‌న్ రాజ‌శేఖ‌ర్…కానీ ఎలా మిస్స‌య్యిందంటే..1

స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి సినిమాకు ఫ‌స్ట్ ఆప్ష‌న్ రాజ‌శేఖ‌ర్…కానీ ఎలా మిస్స‌య్యిందంటే..1

by AJAY
Published: Last Updated on
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన సినిమా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి. జులాయి సినిమాకు కూడా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా అల్లు అర్జున్ హీరోగా న‌టించారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. సినిమాలో అల్లు అర్జున్ చెప్పే పంచ్ డైలాగులు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. త్రివిక్ర‌మ్ మాటలు బ‌న్నీ యాక్ష‌న్ తో ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

Advertisement

ఇక ఈ సినిమా త‌ర‌వాత మ‌ళ్లీ విరిద్ద‌రి కాంబినేష‌న్ లోనే స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి సినిమా వ‌చ్చింది. ఈ సినిమా యావ‌రేజ్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటూ ముఖ్య‌మైన పాత్ర‌లో క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఉపేంద్ర న‌ట‌న‌కు సినిమాలో మంచి మార్కులు ప‌డ్డాయి.

Advertisement

upendra nithya menon

upendra nithya menon

ఉపేంద్ర‌కు భార్య‌గా స్నేహ‌ న‌టించి ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముందుగా ఉపేంద్ర పాత్ర‌కు త్రివిక్ర‌మ్ టాలీవుడ్ సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ ను అనుకున్నార‌ట‌. కానీ క‌న్న‌డలో మంచి మార్కెట్ ఉంటుంద‌ని ఉపేంద్ర‌ను తీసుకున్నార‌ట‌. అలా రాజ‌శేఖ‌ర్ చేయ‌వ‌ల‌సిన ఈ సినిమా ఉపేంద్ర వ‌ద్ద‌కు చేరింది. ఇక ఓ ఇంట‌ర్వ్యూలో ఇదే విష‌యం రాజ‌శేఖ‌ర్ ను అడ‌గ్గా అలా అనుకున్నార‌ని నాకు తెలుసు కానీ సంప్ర‌దించలేద‌ని చెప్పారు.

సంప్ర‌దించి ఉంటే ఉపేంద్ర పాత్ర‌ను తాను చేసేవాడిని అని చెప్పారు. అంతే కాకుండా సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమా కూడా మొద‌ట రాజ‌శేఖ‌ర్ వ‌ద్ద‌కే వెళ్లింద‌ని కూడా ఇండ‌స్ట్రీలో అప్పట్లో వార్త‌లు వినిపించాయి. కానీ ఈ సినిమా కోసం కూడా త‌న‌ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని రాజ‌శేఖ‌ర్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

Visitors Are Also Reading