ఎలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని వివరిస్తూ భాస్కర శతక కర్త మారద వెంకయ్య ఒక పద్యంలో అనైతిక కా_వాంఛ ఉన్న స్త్రీలను నమ్మరాదని చెబుతూ చిత్రాంగి గురించి వివరిస్తాడు.
ఈ పద్యం అదే :
Advertisement
అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే
భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా
రంగధరుం బదంబులు కరంబులు గోయఁగఁజేసెఁ దొల్లి చి
త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా!
చిత్రాంగి కథేంటి? :
రాజరాజనరేంద్రుడు తన కొడుకు సారంగధరుడి పెళ్లి కోసం రాజ్యంలోని అందమైన అమ్మాయిల చిత్ర పటాలను తెప్పిస్తాడు.అలా వచ్చిన ఒక యువతి ఫోటో రాజరాజనరేంద్రుడిని అమితంగా ఆకర్షిస్తుంది. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనుకున్న నరేంద్రుడు చిత్రాంగికి తన కొడుకైన సారంగధరుడి చిత్రపటాన్ని పంపిస్తాడు.సారంగధరుడు అందంగా ఉండడంతో చిత్రాంగి వెంటనే పెళ్లికి ఒప్పుకుంటుంది.
Advertisement
రాజరాజనరేంద్రుడు తాను చిత్రాంగి వద్దకు వెళ్లకుండా తన ఖడ్గాన్ని పంపించి దానికి తాళి కట్టించి ( క్షత్రియ వివాహ పద్దతి) చిత్రాంగిని తీసుకురావాలని తన సైనికులకు చెబుతాడు. నరేంద్రుడి ఇంటికి వచ్చిన చిత్రాంగి అసలు విషయం తెలుసుకొని బాధపడుతుంది. రాజు కావడంతో అతనికి ఎదురుచెప్పకుండా అతడి భార్యగా జీవిస్తుంది.
ఒకరోజు నరేంద్రుడి కొడుకు సారంగధరుడు పావురాలతో ఆడుకుంటుండగా ఓ పావురం చిత్రాంగి గదిలోకి వెళుతుంది. పావురాన్ని వెతుకుతూ సారంగ కూడా చిత్రాంగి గదిలోకి వెళతాడు. సారంగను చూసిన చిత్రాంగి తన కోరిక తీర్చాలని సారంగను కోరుతుంది. తల్లి వరుసైన తనతో అలా చేయడం ఇష్టంలేని సారంగ నిరాకరిస్తాడు. దీంతో చిత్రాంగి రాజరాజనరేంద్రుడితో …సారంగ తనతో తప్పుగా ప్రవర్తించాడని పిర్యాదు చేస్తుంది. చిత్రాంగి మాటలు నమ్మిన తండ్రి కొడుకు కాళ్లు చేతులు నరికివేయిస్తాడు.
Also Read: జై చిరంజీవ సినిమాలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?