గుణ్ణం గంగరాజు నిర్మాతగా జస్ట్ ఎల్లో బ్యానర్‌పై అమృతం టీవీ సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. అప్పట్లో అమృతం సీరియల్ ఓ సంచలనమే అని చెప్పాలి.
Advertisement
ఇప్పటికే ఎన్నో ఛానెల్స్ ఈ సీరియల్స్ ప్రసార హక్కులు కొని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేసినప్పుడల్లా ఈ సీరియల్‌కు భారీ టీఆర్పీ రేటింగ్ వస్తూనే ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే తెలుగు టెలివిజన్ సీరియల్ చరిత్రలో అమృతం ఓ క్లాసిక్‌లా నిలిచిపోయింది. ఈ సీరియల్ ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది.
Also Read : పెగాసస్ అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి కారణం అదే అంటున్న ఆర్ఆర్ఆర్..!
Advertisement
ఓ హోటల్ చుట్టూ తిరిగే కథలతో అల్లుకున్న ఎపిసోడ్స్‌తో వారం వారం తెలుగు వారిని గిలిగింతలు పెట్టిన విషయం విధితమే. ఈ సీరియల్ ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న చాలా మందికి అభిమాన సీరియల్. అప్పట్లో ఎప్పుడెప్పుడు అమృతం కొత్త ఎపిసోడ్ వస్తుందా అంటూ ఎదురు చూసేవారు . ముఖ్యంగా ప్రస్తుతం భారత చలన చిత్ర అగ్రదర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన భార్య రమ ఈ సీరియల్ షూటింగ్‌ను మెట్లపై కూర్చొని మరీ చూసేవారట. సీరియల్‌ను కూడా ఎంతో ఆసక్తిగా చూసేవారట. ఏపని చేస్తున్నా సరే అప్పట్లో ఈ సీరియల్ కోసం సమయం కేటాయించే వారట.
అంజలి, అమృతరావు, వాసు ఇంటూరి, గుండు హన్మంతరావు, శివన్నారాయణ, హర్షవర్థన్, శివాజీరాజా, రాగిని వంటి నటీనటులు ఈ సీరియల్‌లో అద్భుతంగా నటించారు. దాదాపు ఆరేళ్లపాటు తెలుగు ప్రేక్షకులకు ఈ సీరియల్ ఎంతగానో ఆదరించారు. అమతం సీరియల్ టీవీలో ప్రసారాలు అయిపోయాక ఓటీటీ సంస్థలు కొనుక్కొని వాళ్ల ప్లాట్‌ఫారంలో అప్‌లోడ్ చేశాయ్. ప్రస్తుతం అమృతం సీరియల్ జీ5 అనే ఓటీటీలో ఉంది.
Also Read : ‘నాగ చైతన్య’ ని అల్లుడిగా చేసుకోవాలనుకున్న ‘బాలయ్య’ ఎందుకు విరమించుకున్నారంటే??