Telugu News » Blog » ఆర్ఆర్ఆర్ వాళ్లకు ఎందుకు నచ్చిందో తెలియదు.. రాజమౌళి వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఆర్ఆర్ఆర్ వాళ్లకు ఎందుకు నచ్చిందో తెలియదు.. రాజమౌళి వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ads

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. ముఖ్యంగా రాజమౌళి ఎంచుకున్న కథలను చాలా పాషనేట్ గా సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తారు. తాను ఊహించింది ఊహించినట్టుగా తెరపై ఆవిష్కరిస్తుంటారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు.. ఎంత కష్టమైనా పెడతారు.

Advertisement

అంతటి హార్డ్ వర్క్ ని హాబీగా చేసుకున్న జక్కన్న ఆర్ఆర్ఆర్ కోసం విపరీతంగానే కష్టపడ్డారు. కరోనాను లెక్క చేయకుండా షూట్ డేస్ ను పట్టించుకోకుండా అనుకున్నది అనుకున్నట్టుగా తీశారు. తన విజన్ కి మాగ్నమ్ ఒపెస్ కు త్రూ అవుట్ వరల్డ్ నుంచి అప్లాజ్ వస్తుండడంతో హ్యాపీగా పీల్ అవుతున్నారు జక్కన్న.  ఇంటర్నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చెబుతున్నారు రాజమౌళి. ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Advertisement

Also Read :  సమంత కొరియా నుంచి తిరిగివచ్చిన తరువాత నాగచైతన్యను కలువనుందా ? 

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు రాజమౌళి. అసలు ఈ చిత్రం ఫారెనర్స్ కి ఎందుకు నచ్చిందో అంటూ.. షాకింగ్ ఎక్స్ ప్రెషన్ పెట్టి ఇంటర్వ్యూ హోస్ట్ ని షాక్ చేసారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోర్ ఇండియన్స్ కోసం తీసింది.. పాన్ ఇండియా స్పాన్ లోనే తెరకెక్కించిందని కానీ ఇండియాలో కంటే ఇండియా బయటే ఎక్కువ మందికి నచ్చిందన్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ ను అందరూ ఇంతలా మెచ్చుకుంటారు అని అసలు అనుకోలేదన్నారు. ఓ హిట్ సినిమా చేస్తున్నామని మాత్రమే షూటింగ్ స్టేజ్ లో అనుకున్నామని చెప్పుకొచ్చారు జక్కన్న. జపాన్ లో వస్తున్న రెస్పాన్స్ మాత్రం.. అన్బీలీబుల్ అంటూ ఫుల్ ఖుషి అయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి. 

Advertisement

Also Read :  ఎన్టీఆర్ కు 18 లక్షలు.. కృష్ణంరాజుకు 25 లక్షలు.. బొబ్బిలి బ్రహ్మన్న ఫ్లాష్ బ్యాక్..!!