టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా RRR. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి.
Advertisement
కలెక్షన్ ల పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.500 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే 500కోట్ల షేర్ వసూలు చేసి ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
also read : ఆ రెండు ఆర్ఆర్ఆర్ కు మైనస్సే….ఒప్పుకున్న విజయేంద్ర ప్రసాద్…!
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ తక్కువ అయ్యిందని కొంతమంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై రాజమౌళి సినిమా విడుదలకు ముందే స్పందించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ……టాప్ స్టార్ డమ్ ఉన్న ఇద్దరు హీరోలతో సినిమా చేస్తున్నప్పుడు…..ఒక హీరోకు పాట పెడితే మరో హీరోకు పాట పెట్టడం….ఒక హీరోకు ఫైట్ పెడితే మరో హీరోకు ఫైట్ పెట్టడం లాంటివి చేసుకుంటూ పోతే కథ బలం చచ్చిపోతుందని చెప్పారు.
Advertisement
ALSO READ : బాలయ్య ఎంత కట్నం తీసుకున్నారు? వసుంధర ఎవరి కూతురు?
ఒక ఫిల్మ్ మేకర్ గా తాము కథను నమ్ముతామని అన్నారు. సినిమాకు ఆడియన్స్ వచ్చినప్పుడు చరణ్ తారక్ లను మర్చిపోయి తాను తీసిన సినిమాను చూడాలని తాము అనుకున్నామని చెప్పారు. ఇద్దరికీ బ్యాలెన్స్ ఉండాలని అయితే అది స్టోరీ కూడా బ్యాలెన్స్ అయ్యేలా ఉండాలని చెప్పారు.
కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కు ఎంత ప్రాధాన్యత ఇచ్చామో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ఇదిలా ఉంటే మనవాళ్లు ఎన్టీఆర్ పాత్ర తక్కువైందని ఆందోళన చెందుతున్నా బాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలలో మాత్రం ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. అదే విధంగా చరణ్ నటనకు కూడా ప్రశంసలు అందుతున్నాయి.