Home » మ‌హేశ్ బాబుతో జ‌క్క‌న్న మ‌ల్టీస్టార‌ర్…!

మ‌హేశ్ బాబుతో జ‌క్క‌న్న మ‌ల్టీస్టార‌ర్…!

by AJAY
Ad

బాహుబ‌లి సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి పాన్ ఇండియా సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ రామ్ చ‌రణ్ హీరోలుగా రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈ చిత్రం టీజ‌ర్ ట్రైలర్ అను ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. దాంతో ఈ సినిమా పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా విడ‌దల తేదీని చిత్ర యూనిట్ త్వ‌ర‌లోనే ఫైన‌ల్ చేయ‌నుంది.

rajamouli mahesh babu

Advertisement

Advertisement

ఇదిలా ఉండ‌గా ఈ సినిమా త‌ర‌వాత రాజ‌మౌళి మ‌హేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే రాజ‌మౌళి ఈ సినిమా స్క్రిప్ట్ ప‌నిలో ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో మ‌రో బిగ్ స్టార్ కూడా న‌టించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమా కూడా మ‌ల్టీ స్టార‌ర్ గా ఉండ‌బోతుంద‌ని టాక్. అయితే ఆ స్టార్ హీరోను బాలీవుడ్ నుండి తీసుకోబోతున్నార‌ట‌.

Mahesh babu

Mahesh babu

అయితే మ‌ల్టీ స్టార‌ర్ అయిన‌ప్ప‌టికీ సినిమాలో ఇద్ద‌రు హీరోలు ఒకేసారి క‌నిపించ‌కుండా ఎవ‌రి ఎపిసోడ్ వారికే ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇక మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర‌వాత మ‌హేశ్ బాబు త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం త‌ర‌వాత రాజ‌మౌళితో సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

Visitors Are Also Reading