Home » ఆర్ఆర్ఆర్ లో బ్లండర్ మిస్టేక్ చేసి దొరికిపోయిన జక్కన్న… ఆడేసుకుంటున్న నెటిజన్లు..!

ఆర్ఆర్ఆర్ లో బ్లండర్ మిస్టేక్ చేసి దొరికిపోయిన జక్కన్న… ఆడేసుకుంటున్న నెటిజన్లు..!

by AJAY
Ad

రాజ‌మౌళి ఈ పేరు ప్ర‌స్తుతం దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఇండియాలో ఎంతోమంది ద‌ర్శ‌కులు ఉన్నారు. కానీ దేశం మొత్తాన్ని త‌న‌వైపు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు మాత్రం రాజ‌మౌళి ఒక్క‌రే అని చెప్పాలి. అంతే కాకుండా ఫ్లాప్ రుచి చూడ‌ని ద‌ర్శ‌కుడు కూడా జ‌క్క‌న్న ఒక్క‌డే. ప్రేమ‌క‌థ‌లు, ఫ్యాక్ష‌న్ సినిమాలు అంటే ఒకే ఫార్ములాను ఫాలో అవుతున్న టాలీవుడ్ ను జ‌క్క‌న్న స‌రికొత్త సినిమాల‌తో కొత్తదారిలో న‌డిచేలా చేశాడు.

Advertisement

ఆయ‌న‌ను ఆద‌ర్శ‌కంగా తీసుకుని ఇప్పుడు ఎంతో మంది కొత్త ద‌ర్శ‌కులు కొత్త క‌థ‌ల‌తో ఆలోచ‌న‌ల‌తో సినిమాలు చేస్తున్నారు. అంతే కాకుండా పాన్ ఇండియా అంటూ తెలుగు న‌టుల‌నే రాజ‌మౌళి దేశానికి ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమాలో ఇద్ద‌రు టాలీవుడ్ స్టార్ లు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ లో రికార్డులు క్రియేట్ చేసింది.

Advertisement

rajamouli

rajamouli

అన్ని భాష‌ల్లోనూ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక ఈ సినిమాను జ‌క్క‌న్న ఏళ్ల త‌ర‌బ‌డి చిత్రీక‌రించిన సంగ‌తి తెలిసిందే. సినిమా చూసిన త‌ర‌వాత ఈ సినిమాకు ఆ మాత్రం స‌మ‌యం ప‌డుతుంద‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఈ చిత్రంలో జ‌క్క‌న్న చిన్న చిన్న మిస్టేక్ లు కూడా చేశారు. ఇక ఆ మిస్టేక్ ల‌ను గ‌మ‌నించిన నెటిజ‌న్లు వాటిని ప‌ట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారు.

సినిమాలో ఎన్టీఆర్ బుల్లెట్ బైక్ తో క‌నిపిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ బైక్ కు ముందు ఒక నంబ‌ర్ ఉంటే వెన‌కాల మ‌రొక నంబ‌ర్ క‌నిపిస్తోంది. బండికి ముందు నంబ‌ర్ ప్లేట్ పై 5079 ఉండ‌గా…బండి వెన‌కాల నంబ‌ర్ ప్లేట్ పై 1030 అని రాసి ఉంది. దాంతో ఓ నెటిజ‌న్ కేసు న‌మోదు చేయండి అంటూ సోష‌ల్ మీడియాలో హైద‌రాబాద్ పోలీసుల‌ను టాగ్ చేశాడు. దానికి హైద‌రాబాద్ పోలీసులు రిప్లై ఇస్తూ ఆ బండి క‌నిపించిన ప్ర‌దేశం స‌మ‌యం స‌రిగ్గా చెప్పాలంటూ రిప్లై ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Also read :

తెలుగులో 24గంట‌ల్లోనే అత్య‌ధిక వ్యూవ్స్ సంపాదించిన టాప్ 5 లిరిక‌ల్ వీడియోలు..!

తిరుప‌తి భ‌హిరంగ స‌భ‌లో ఎన్టీఆర్ పై కృష్ణ చేసిన ఘాటు విమ‌ర్శ‌లు…ఆ త‌ర‌వాత వైఎస్ఆర్ ఎమ‌న్నారంటే…!

Visitors Are Also Reading