Home » నన్ను కొట్టే ధైర్యం ఆ ముగ్గురికే ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!!

నన్ను కొట్టే ధైర్యం ఆ ముగ్గురికే ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే దేశం మొత్తం చిన్న చూపు ఉండేది. అలాంటి ఇండస్ట్రీ ఖ్యాతిని దేశ నలుమూలల పొగిడే విధంగా చేసిన డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాల ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు ఖ్యాతిని చాటాడు. వందల కోట్ల బడ్జెట్ అంటే ఏమిటో రుచి చూపించాడు. అంతటి క్రియేటివ్ డైరెక్టర్ ను తెలుగు ఇండస్ట్రీలో కొట్టే వారే లేరు. కానీ రాజమౌళిని కొట్టే ధైర్యం ఆ ముగ్గురికి ఉందంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం. రాజమౌళికి తన భార్య రమా అంటే చాలా ఇష్టం.

Advertisement

also read:Adivi sesh:ఒక్క ఫ్యామిలీ నుంచి 10మంది హీరోలుంటే మాలాంటి వారికి ఛాన్సులు దక్కేదెలా అంటూ ఎమోషనల్..!

Advertisement

ఆమె జక్కన్న కంటే ధైర్యవంతురాలట. ఆమె అంత ధైర్యం ఇచ్చింది కాబట్టే వందల కోట్ల ప్రాజెక్టును కూడా చేయగలిగాడట. అలాంటి రాజమౌళి జీవితంలో ఆ ముగ్గురు ఆడవాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతూ ఉంటారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది రాజమౌళి తల్లి. ఆమె చెప్పిన మాటలు పెంచిన పెంపకం వలన ఈ రోజు రాజమౌళి దర్శకుడుగా మారారట. ఆ తర్వాత తన భార్య రమ. రమ ఏం చెప్పినా రాజమౌళి ఒకటికి రెండుసార్లు వింటారట. ఇక మూడవది రాజమౌళి కూతురు మయూక. అయితే రాజమౌళి కూతురు మయూక తన తండ్రిని తన చిటికెన వేలు మీద ఆడిస్తుందట. ఆమె ఏది చెప్తే అది చేస్తారట.

అంటే రాజమౌళికి తన కూతురు అంటే అంత ప్రేమ. అంతేకాకుండా దర్శక దిగ్గజం రాజమౌళిని ఈ ముగ్గురు ఆడవాళ్లు మాత్రమే కొట్టగలరట. తన చిన్నతనంలో తన తల్లి చనిపోయే వరకు పదిసార్లు కొట్టిందని చెప్పారు. అంతేకాకుండా తన భార్య మరియు అమ్మ కూడా ఒక సమయంలో తనపై చేయి చేసుకున్నారట. ఇక తన బిడ్డ మయూక వీరిద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా ఉండటం వల్ల రాజమౌళి నెత్తిమీదికి ఎక్కి తొక్కేయ గల సన్నిహిత్యం ఉంటుందట.

also read:హీరోయిన్ కమలిని ముఖర్జీ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

Visitors Are Also Reading