పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఛత్రపతి కూడా ఒకటి. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఊరమాస్ యాక్షన్ మరియు సెంటిమెంట్ తో ఈ సినిమా మంచి విజయం సాధించింది. సినిమా వచ్చిన ఇన్నేళ్లకు కూడా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ కథతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడంటే ఈ సినిమా స్టామినాను అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఛత్రపతి సినిమాకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పలేదన్న విషయం మాత్రం అతికొద్దిమందికి మాత్రమే తెలిసిన నిజం. ఈ సినిమా సమయంలో ప్రభాస్ అందుబాటులో లేకపోవడం వల్ల డబ్బింగ్ ఆలస్యం అయ్యింది. మరోవైపు సినిమా విడుదల తేదీ చూస్తే దగ్గరపడింది. దాంతో ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళినే డబ్బింగ్ చెప్పేశాడు. ఇక ఈ సినిమాలో ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు అంటూ డైలాగులు ఎలా పేలాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా విజయం తరవాత మళ్లీ ప్రభాస్ తో రాజమౌళి బాహుబలి సినిమాను తీశాడు.
Advertisement
Advertisement
రెండు పార్టులుగా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని దేశం మొత్తానికి పరిచయం చేసింది. ఈ సినిమాతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అంతే కాకుండా రాధే శ్యామ్ విడుదలకు సిద్దంగా ఉంది. మరోవైపు జక్కన్న ఆర్ఆర్ఆర్ తో మరోసారి బాలీవుడ్ ను షేక్ చేసేందుకు రెడీ అయ్యాడు.