Home » ఈ సీన్స్ చూడగానే మీకు అదే డౌట్ వచ్చిందా ? జక్కన్న దొరికిపోయారు గా ! అచ్చం అలానే ..!

ఈ సీన్స్ చూడగానే మీకు అదే డౌట్ వచ్చిందా ? జక్కన్న దొరికిపోయారు గా ! అచ్చం అలానే ..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం దేశంలోనే టాప్ డైరెక్ట‌ర్ గా రాజ‌మౌళి ఉన్నారు. బాలీవుడ్ హీరోలు సైతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేసేందుకు ఎంతో ఆస‌క్తి చూపిస్తున్నారు. జ‌క్క‌న్న సినిమాలకు బాలీవుడ్ ప్రేక్ష‌కుల తో పాటూ విదేశీ అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. రీసెంట్ గా వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ పై విదేశీ క్రిటిక్స్ సైతం సోష‌ల్ మీడియా వేదికగా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా 14 కేట‌గిరీల‌లో ఆస్కార్ బ‌రిలో నిలిచింది.

Advertisement

ఆస్కార్ వ‌చ్చినా రాక‌పోయినా ఇప్ప‌ట్లో మాత్రం జ‌క్క‌న్న క్రేజ్ ను బీట్ చేసే ద‌ర్శ‌కుడు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. ఇక ప్ర‌స్తుతం రాజ‌మౌళి మ‌హేశ్ బాబు తో మ‌రో పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా భారీ బ‌డ్జెట్ తో ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే అలాంటి టాప్ డైరెక్ట‌ర్ త‌న సినిమాలో ఓ పాత సీన్ ను కాపీ కొట్టారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా నటించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా విక్ర‌మార్కుడు. ఈ సినిమాతో ర‌వితేజ‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ప‌డ‌టంతో పాటూ జ‌క్క‌న్న‌కు కూడా చాలా క్రేజ్ వ‌చ్చింది. ఈ సినిమాలో ర‌వితేజ పోలీస్ పాత్ర‌లో న‌టించాడు. ఇక ఈ సినిమాలో విల‌న్ త‌మ్ముడు సైకోలా ప్ర‌వ‌ర్తిస్తూ దారుణాల‌కు పాల్ప‌డుతూ ఉంటాడు.

అత‌డు సైకోలా ప్ర‌వ‌ర్తిస్తూ ఆడ‌వాళ్ల‌ను వేదిస్తూ ఉంటాడు. ఇక విల‌న్ త‌మ్ముడి పుట్టిన రోజునాడే ర‌వితేజ అత‌డిని హ‌త‌మార్చి విల‌న్ కు వార్నింగ్ ఇస్తాడు. అయితే అచ్చం అలాంటి సీన్ ఒక‌టి విజ‌య‌శాంతి సినిమాలో ఉంది. దాంతో ప్ర‌స్తుతం విజ‌యశాంతి సినిమాలోని సీన్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. విక్ర‌మార్కుడు సినిమాలోని సీన్ ను జ‌క్క‌న్న విజ‌య‌శాంతి సినిమా నుండి కాపీ కొట్టాడా అంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

Visitors Are Also Reading