Telugu News » మమ్మల్ని నెగ్గించడానికి చిరంజీవి తగ్గారు…రాజమౌళి ఎమోషనల్…!

మమ్మల్ని నెగ్గించడానికి చిరంజీవి తగ్గారు…రాజమౌళి ఎమోషనల్…!

by AJAY MADDIBOINA

రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 25 న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్ లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన ఏపీ తెలంగాణ మంత్రులు సీఎం లకు ధన్యవాదాలు చెప్పారు.

Ads
rajamouli

rajamouli

టికెట్ ధరలపై ఏపీ సర్కార్ తో చర్చించేందుకు ప్రయత్నాలు జరిపామని అన్నారు. చిరంజీవి తన సాన్నిహిత్యం ను ఉపయోగించి సీఎం జగన్ ను కలిసి టికెట్ ధరలు పెంచెలే చేశారు అని చెప్పారు. త‌మ‌ను నెగ్గించ‌డానికి చిరంజీవి త‌గ్గించుకున్నర‌ని రాజ‌మౌళి చిరుపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక ఏపీలో ప‌ది రోజుల పాటు ఆర్ఆర్ఆర్ టికెట్ ధ‌ర‌లను పెంచుకోవ‌డానికి అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు తెలంగాణ‌లో కూడా ఇప్ప‌టికే టికెట్ ధ‌ర‌ల పెంపుకు అనుమ‌తులు ఇచ్చారు.


You may also like