Home » మ‌హేశ్ సినిమాలో బాల‌య్య‌….క్లారిటీ ఇచ్చిన జ‌క్క‌న్న‌..!

మ‌హేశ్ సినిమాలో బాల‌య్య‌….క్లారిటీ ఇచ్చిన జ‌క్క‌న్న‌..!

by AJAY
Ad

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌లకు సిద్దంగా ఉంది. ఈ సినిమా త‌ర‌వాత జ‌క్క‌న్న ఎవ‌రితో సినిమా చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌హేశ్ బాబు రాజ‌మౌళి సినిమా ఉంటుందంటూ కొద్ది రోజులుగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక ఆ వార్త‌ల‌పై రాజ‌మౌళి కూడా క్లారిటీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రాజ‌మౌళి దేశ‌వ్యాప్తంగా వివిధ భాషల్లో మీడియా ఛానల్స్ కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు.

Advertisement

Advertisement

ఈ నేప‌థ్యంలోనే రాజ‌మౌళి బెంగుళూరులో ఓ మీడియా ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో మహేశ్ బాబు సినిమా గురించి ప్ర‌శ్నించారు. దాంతో రాజ‌మౌళి త‌న త‌దుప‌రి సినిమా మ‌హేశ్ బాబుతోనే ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలయ్య న‌టిస్తున్నార‌ని కూడా కొద్ది రోజులుగా వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దాని గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో బాల‌య్య న‌టించ‌డం లేద‌ని చెప్పారు. ఈ సినిమాలో కేవ‌లం మహేశ్ బాబు ఒక్క‌డే హీరో అని అన్నారు. ఇక జ‌క్క‌న చెప్పిందాంతో మ‌హేశ్ బాబు సినిమాలో బాల‌య్య న‌టించ‌డం లేద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

Visitors Are Also Reading