Home » “మహాభారతం” తీస్తే అన్ని భాగాలుగా తీయాలి… రాజమౌళి..!

“మహాభారతం” తీస్తే అన్ని భాగాలుగా తీయాలి… రాజమౌళి..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అయినటువంటి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో సినిమా దర్శకుడుగా కెరియర్ను మొదలుపెట్టిన రాజమౌళి ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు.

Advertisement

అందులో దర్శకత్వం వహించిన ప్రతి మూవీతోనూ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న రాజమౌళి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా రాజమౌళి “ఆర్ఆర్ఆర్” అనే మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలోని “నాటు నాటు” అనే సాంగ్ కు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఈ మూవీ ద్వారా రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది.

Advertisement

రాజమౌళి తన తదుపరి మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ “మహాభారతం” అని తన లైఫ్ లో మహాభారతం సినిమాను కచ్చితంగా రూపొందిస్తాను అని ఎన్నో సార్లు చెప్పుకొచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. దానితో రాజమౌళి ఎప్పుడు మహాభారతం మూవీని రూపొందిస్తాడా అని ఎంతోమంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళి పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమంలో భాగంగా మహాభారతం మూవీ గురించిన ప్రస్తావన వచ్చింది. టీవీలో ఆ కథను 260 కి పైగా ఎపిసోడ్ లుగా చిత్రీకరించారు అని… మరి దానిని మీరు మూవీగా తీస్తే అది ఎన్ని పార్ట్ లుగా ఉండే అవకాశం ఉంది అని రాజమౌళి ని ఒక వ్యక్తి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ మహాభారతం మీద ఇండియాలో వచ్చిన అన్ని వెర్షన్ లను చదవడానికే సంవత్సరం కన్నా ఎక్కువ టైమ్ పడుతుంది. ఇక మహాభారతం ను సినిమా తీస్తే పది భాగాలుగా తీయాల్సి ఉంటుందని నా అంచనా అని రాజమౌళి తాజాగా తెలిపాడు.

Visitors Are Also Reading