Home » వాన వాన.. సెమీస్ కు వెళ్లే జట్లేవి వాన..!

వాన వాన.. సెమీస్ కు వెళ్లే జట్లేవి వాన..!

by Azhar
Ad

ఆస్ట్రేలియా వేదికగా ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ అనేది జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సూపర్ 12 రౌండ్ లో జట్లు సెమీస్ కోసం పోటీ పడుతున్నాయి. మాములుగా అయితే ఏ జట్టు బాగా ఆడితే ఆ జట్టు సెమీస్ కు వెళ్తుంది. జట్టు ప్రదర్శన అనేది దాని స్థాయిని నిర్ధారిస్తుంది. కానీ ఈ ప్రపంచ కప్ లో మాత్రం జట్ల స్థాయిని వాన నిర్ణయిస్తుంది.

Advertisement

ఈ ప్రపంచ కప్ మొదలైన తర్వాత నుండి ఆసీస్ లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా నాలుగు మ్యాచ్ లు రద్దయ్యాయి. అందులో ఇంగ్లాండ్, ఆఅస్ట్రేలియా మధ్య జారగాల్సిన కీలక మ్యాచ్ ఈ రోజు రద్దయింది. అందువల్ల సెమీస్ కు ఈ జట్లు వెళ్తాయి అని అందరూ వేసుకున్న ఓ అంచనాను వరుణుడు మార్చేస్తున్నాడు.

Advertisement

ఈ వర్షం వల్లే ఇంగ్లాండ్ పైన ఐర్లాండ్ గెలిచింది. ఇక ఆఫ్గనిస్తాన్ రెండు మ్యాచ్ లు వరుణుడు జరగనివ్వలేదు. అందువల్ల ఈ ప్రపంచ కప్ పై మిమ్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. ఏ ఏ జట్లు సెమీస్ కు పంపిస్తున్నాయి వాన అన్ని ఫ్యాన్స్ అడుగుతున్నారు. అలాగే ఈ ప్రపంచ అప్ విన్నర్ ఇండియా, ఆసీస్, న్యూజిలాండ్ కాదు.. వర్షం టైటిల్ అందుకుంటుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది అని.. వర్ష కాలంలో ఎవడైనా టోర్నీ పెడతాడా అని ఐసీసీని కూడా ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

అప్పుడే నా కెరియర్ ముగిసేది అంటున్న అశ్విన్..!

పాకిస్థాన్ నుండి వెళ్లే పాకిస్థాన్ ను ఓడించిన సికందర్ రజా..!

Visitors Are Also Reading