Telugu News » Rahul ramakrishna : సినిమాల‌కు గుడ్ బై చెబుతున్నా..అర్జున్ రెడ్డి క‌మెడియ‌న్ ప్ర‌క‌టన‌..!

Rahul ramakrishna : సినిమాల‌కు గుడ్ బై చెబుతున్నా..అర్జున్ రెడ్డి క‌మెడియ‌న్ ప్ర‌క‌టన‌..!

by AJAY MADDIBOINA

అర్జున్ రెడ్డి సినిమాతో క‌మెడియ‌న్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు రాహుల్ రామ‌కృష్ణ‌. నిజానికి త‌రుణ్ భాస్క‌ర్ దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా రాహుల్ రామ‌కృష్ణ మొద‌ట‌గా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం అయ్యారు. ఆ త‌ర‌వాత అర్జున్ రెడ్డి సినిమాలో న‌టించాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌గా రాహుల్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. రాహుల్ కామెడీ యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా ఉండ‌టంతో వ‌రుస ఆఫ‌ర్లు అందుకున్నారు. రాహుల్ ప్రధాన పాత్ర‌లో న‌టించిన జాతిర‌త్నాలు సినిమా కూడా బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. రీసెంట్ గా స్కైలాబ్ అనే సినిమాలో న‌టించారు.

Ads
RAHUL RAMAKRISHNA

RAHUL RAMAKRISHNA

ఈ సినిమా అనుకున్నమేర విజ‌యం సాధించ‌లేదు. అయితే ఇంత‌టి క్రేజ్ ఉన్న క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను 2022 త‌ర‌వాత సినిమాలు చేయ‌న‌ని ప్ర‌క‌టించారు. ఎవ‌రు ఏమ‌నుకున్నా తాను ప‌ట్టించుకోన‌ని తాను సినిమాల‌కు దూర‌మ‌వుతున్నా అంటూ రాహుల్ ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించారు. అయితే సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌డానికి కార‌ణం ఏంటో మాత్రం రాహుల్ రామ‌కృష్ణ చెప్ప‌లేదు. దాంతో మీరు మంచి న‌టుడు అని మీరు సినిమాలు కొన‌సాగించాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు.


You may also like