Home » నెటిజ‌న్స్ ను ఫూల్స్ చేశా.. అది జోక్ రాహుల్ రామ‌కృష్ణ

నెటిజ‌న్స్ ను ఫూల్స్ చేశా.. అది జోక్ రాహుల్ రామ‌కృష్ణ

by Anji
Ad

అర్జున్‌రెడ్డి చిత్రంతో ఓవ‌ర్ నైట్ స్టార్ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు రాహుల్ రామ‌కృష్ణ. ఈ చిత్రం త‌రువాత రాహుల్ వెనుతిరిగి చూసుకోలేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ క‌మెడీయ‌న్ గా కొన‌సాగుతున్న రాహుల్ స‌డెన్‌గా ఈ రోజు ఉద‌యం సినిమాలు నుంచి త‌ప్పుకుంటున్నట్టు ట్వీట్ చేసి సంచ‌ల‌నం సృష్టించాడు. 2022 నాచివ‌రిది. ఇక‌పై సినిమాలు చేయ‌న‌ని ట్వీట్ చేసాడు.

Advertisement

దీంతో రాహుల్ కు ఏమైంది ఎందుకు సినిమాల‌ను ఆపేస్తున్నాడు నెటిజ‌న్స్‌. అభిమానులు ఆయ‌న‌కు ట్వీట్ల మీద ట్వీట్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇక దీంతో ఈ సాయంత్రానికి ఈ ట్వీట్ రాహుల్ క్లారిటీ ఇస్తూ మ‌రొక ట్వీట్ పోస్ట్ చేశారు. సినిమాలు చేయ‌ను అని జోక్ చేశాను. ఫూల్స్‌.. భారీ రెమ్యున‌రేష‌న్, విలాస‌మైన జీవితం, ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను ఎందుకు వ‌దులుకుంటాను.

Advertisement

నేను రిటైర్మెంట్ చెప్పాన‌ని న‌న్ను అభినందించ‌డానికి నా స్నేహితులు ఫోన్ చేయ‌డం ఆశ్చ‌ర్యం. న‌మ్మ‌లేక‌పోతున్నా అంటూ ట్వీట్ చేశాడు. దీంతో రాహుల్ జోక్ చేశాడు. నిజంగా సినిమాలు మాన‌డం లేద‌ని తెలుస్తోంది. అయిపోతే ఈ జోక్ పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి విష‌యాల్లో జోక్ ఏమిటి..? అయినా మ‌మ్ముల్ని ఫూల్ చేయ‌డానికీ మేము ఎలా క‌నిపిస్తున్నాం. మీ సినిమాల‌తో ఫూల్స్ చేయ‌డ‌మే కాకుండా ఇలాంటి ట్వీట్స్ తో కూడా ఫూల్స్ చేస్తున్నావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read :  ఆ స్టార్ ద‌ర్శ‌కునికి మ‌హేష్‌బాబు క్ష‌మాప‌ణ

Visitors Are Also Reading