డిసెంబర్ లోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులో జరిగిన వాదోపవాదానలపై అమరావతి రైతులు ఆందోళన చెందవద్దని, భయపడవద్దని, బాధపడవద్దని పిలుపు ఇచ్చారు. అమరావతిలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తక్షణమే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, సోమవారం నాటికి స్టే తీసుకునివద్దామని ఆయన సూచించారు.
Advertisement
సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని, రైతుల పక్షాన తప్పకుండా స్టే లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పేదల కడుపు కొట్టేవాడు బాగుపడిన దాఖలాలు లేవని, రుషికొండకు గుండు కొట్టినట్లుగానే అమరావతి ప్రాంతంలో కూడా యుద్ధ ప్రాతిపదికన గుడిసెలు వేసే ప్రమాదం ఉందని, అమరావతి అనే మహా యజ్ఞంలో మారీచుడైన జగన్ మోహన్ రెడ్డి గారికి ఇతరులు అందరూ మారీచులలాగే కనిపిస్తారని అన్నారు.
Advertisement
తాను యుద్ధం చేస్తోంది మారీచులతో అని జగన్ మోహన్ రెడ్డి గారు పేర్కొంటుంటే… ప్రజలు యుద్ధం చేయాలనుకుంటుంది ఆ మారీచుని తోనేనని ఆయన తెలిపారు. ప్రజలు మారీచుని మాటలు నమ్మవద్దని, అలాగే హైకోర్టును అపార్థం చేసుకోవద్దని కోరారు. అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కొట్టివేసినా బాగుండేదని, ఈనెల 19వ తేదీకి వాయిదా వేయడం వల్ల సుప్రీం కోర్టులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణ రాజు గారు ఆందోళన వ్యక్తం చేశారు.