సినీ రంగంలో హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు ఇలా ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. దర్శకుడు కే రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన గురించి అందరికీ సుపరిచితమే. ఆయన రూటే సెపరేట్ అన్నట్టుగా ఉంటారు. అవసరాన్ని బట్టి హీరోయిన్ల మీద పువ్వులు, పండ్లు గుప్పిస్తారని పేరు ఉంది. కే రాఘవేంద్రరావు పేరు పక్కన బీఏ అని ఉంటుంది లేకపోతే ఆయన దర్శకేంద్రుడు కాదు అని అర్థం. తన పేరు పక్కన బీఏ ఉండడం అనేది సెంటిమెంట్ గా చెప్పుకుంటారు రాఘవేంద్రరావు. ఆయన బీఏ ని చాలా సెంటిమెంట్ గా భావించారు అది లేకపోతే ఒక సినిమా ఫ్లాప్ అయిపోయింది కూడా.
Advertisement
టైటిల్ కార్డు లో రాఘవేంద్రరావు తన పేరు పక్కన బీఏ అని రాయిస్తారు అది మిస్ అవ్వడం వలన ఒక సినిమా ప్లాప్ కూడా అయ్యిందట. తన పేరుని సినిమాలో ఎలా వేశారు అనేది పట్టించుకోని రాఘవేంద్రరావు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అతను సన్నిహితులు ఈ విషయం చెప్పారు. మిస్ అవ్వకుండా బీఏ రాయమని అది సెంటిమెంట్ గా ఫీల్ అవుతానని చెప్పేవారట రాఘవేంద్రరావు. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అయినప్పటికీ చాలామంది అనుకునేది బి అంటే బొడ్డు, ఏ అంటే ఆపిల్ అని తన గురించి ఇలా అనుకుంటున్నా సరే స్పోర్టివ్ గా తీసుకున్నారు.
Advertisement
రాఘవేంద్రరావు బీఏ చేయడం వెనుక ఉన్న కథ గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. టెన్త్ పాస్ అయిన తర్వాత తండ్రి ఒక మాట అన్నారట. నువ్వు దర్శకుడు అవ్వాలంటే చదవాలి అని అన్నారట. డైరెక్టర్ గా సక్సెస్ అవ్వకపోతే డిగ్రీ ఉంటుంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్పారట. ఇలా బీఏ పూర్తి చేశారు. బుక్స్ కొనుక్కోడానికి తండ్రి ఇచ్చే డబ్బులతో సినిమా చూసేవారట. తన ఫ్రెండ్ దగ్గర ఉన్న బుక్స్ ని ఎగ్జామ్స్ కి ఐదు రోజులు ముందు తీసుకొని చదవడం మొదలు పెట్టే వారట. డిగ్రీ పూర్తి చేశారట. నా ఫ్రెండ్ కి ఎంతో రుణపడి ఉంటానని రాఘవేంద్రరావు చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!