Home » నేను సాయం చేసి.. నేనే పాదాలకు నమస్కరిస్తా..!

నేను సాయం చేసి.. నేనే పాదాలకు నమస్కరిస్తా..!

by Azhar
Ad
కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం అనేది ఎక్కువగా ఎవరు చేయరు. కానీ సమాజంలో గొప్ప పేరు.. లేదా ఫెమ్ ఉన్న వారిలో కొంతమంది మాత్రమే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. ఇక సినిమా సెలబ్రెటీలలో అలా సహాయం చేసేవారిని మనం తక్కువగానే చూడవచ్చు. కానీ వారిలో సూపర్ డ్యాన్సర్, యాక్టర్ అయిన రాఘవ లారెన్స్ తప్పవుకుండా ఉంటారు. ఈయన కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, యాక్టర్ గా మంచి పేరు అనేది సినీ ప్రపంచంలో సంపాదించుకున్నారు.
అయితే రాఘవ లారెన్స్ తన నటన అలాగే మిగిలిన టాలెంట్స్ వల్లే కాకుండా.. ఆయన చేసే మంచి పనుల వల్ల కూడా ఎంతో పేరు అనేది తెచ్చుకున్నారు. ఎవరైనా సహాయం కావాలని కోరితే.. ఆయన చేయగలిగినంత సహాయం చేస్తారు. అయితే ఇప్పుడు ఈయన ఓ కొత్త నిర్ణయం అనేది తీసుకున్నారు. దానిని తా జీవితంలోని ఓ పెద్ద మార్పుగా తెలిపారు.
మాములుగా ఓ వ్యక్తికి ఎవరైనా సహాయం చేస్తే.. ఆ సహాయం చేసిన వ్యక్తికి నమస్కరించడం.. కాళ్ళు మొక్కడం వంటివి చేస్తారు. అయితే ఇక నుండి తాను సహాయం చేసే వ్యక్తులు ఎవరు కూడా అలా చేయకూడదు అని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. తాను ఎవరికీ అయితే సహాయం చేస్తానో.. వారి కాళ్ళు తానే మొక్కుతాను అంటూ ప్రకటిస్తూ.. సోషల్ మీడియాలో ఓ పిల్లాడి కాళ్ళు మొక్కుతున్న ఫోటోను కూడా షేర్ చేసాడు.

Advertisement

Visitors Are Also Reading