Home » ఆర్ఆర్ఆర్ కు పోటీగా రాధే శ్యామ్…రిలీజ్ డేట్ ఫిక్స్ …!

ఆర్ఆర్ఆర్ కు పోటీగా రాధే శ్యామ్…రిలీజ్ డేట్ ఫిక్స్ …!

by AJAY
Ad

ప్రభాస్ పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకు జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. పిరియాడికల్ ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

RADHESHYAM FIRST REVIEW

RADHESHYAM 

ఇక ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ మరోసారి ప్రకటించింది. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ సినిమా ఓటిటి లో విడుదల కాబోతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లలోనే విడుదల అవుతుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Advertisement

ఇది ఇలా ఉంటే ఈ రోజే ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాను మార్చి 11న విడుదల చేస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు పోటీపడి పోతున్నాయని అర్థం అవుతోంది. మరోవైపు ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నాయి. తెలుగు సినిమాలు ఇటు తెలుగులోనూ మరియు మిగతా ఇండస్ట్రీలలో పోటీపడటం ఇదే మొదటిసారి.

Visitors Are Also Reading