పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే జంట నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ రాధేశ్యామ్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్త నిర్మాణంలో చిత్రం రూపొందింది. హస్తసాముద్రిక నిపుణుడిగా ప్రభాస్ నటిస్తుండగా.. మరొక ప్రధాన పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. మరొక కీలక పాత్రలో జగపతిబాబు నటించారు. ఇది వరకు విడుదలైన రాధేశ్యామ్ టీజర్స్, సింగిల్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. సెన్సార్ కార్యక్రమాలను ఇంతకు ముందే పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిపికెట్ జారీ చేశారు. అదేవిధంగా సినిమా రన్‌టైమ్‌ను 150 నిమిషాలు.. అనగా రెండున్నర గంటల సమయం. దర్శకుడు రాజమౌళి సూచన మేరకు దాదాపు 12 నిమిషాలు ట్రిమ్ చేశారు.
Advertisement
Advertisement
బెటర్ ఔట్ పుట్ కోసం చాలా వరకు కొన్ని సన్నివేశాలను కూడా కత్తిరించారట, మరికొన్నింటిని జోడించారట. ముఖ్యంగా రాధేశ్యామ్ సినిమా మొత్తం మీద 56 సవరణలు జరిగాయని టాక్ వినిపిస్తోంది. దాదాపు 49 మేకర్స్ చేసిన కట్స్ ఉన్నాయట. దాదాపు ఏడు చోట్ల మార్పులు జరిగాయట. ఆసక్తికరంగా కొనసాగే సన్నివేశాలకు ఏమాత్రం ఆటంకం కలగని రీతిలో మార్పులు జరిగాయట.
సినిమా మొత్తానికి 23 నిమిషాల పుటేజ్ తొలగించి.. 11 నిమిషాల సన్నివేషాలను జోడించారట. దీంతో సినిమా మరింత గ్రిప్పింగ్‌గా వచ్చిందట. మొత్తానికి రాధేశ్యామ్ సినిమాను 138 నిమిషాలకు కుదించారు. రెండు గంటల 18 నిమిషాల రన్ టైమ్‌తో రాధేశ్యామ్ చిత్రం అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తోందట. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఈ సినిమాలో చాలా విజువల్ ఎఫెక్ట్‌తో మరొక టైటానిక్ సినిమాకు ధీటుగా తీసినట్టు సమాచారం. ఓవైపు ప్రభాస్ జరుగబోయేది చెబుతుండగా , మరొక వైపు పూజాహెగ్దే డాక్టర్‌గా కనిపించడం విశేషం.