Home » ప్ర‌భాస్ జాత‌కం చూసి పెళ్లి గురించి పండితులు ఏమ‌న్నారో తెలుసా..? ఆ జ్యోతిషుడు ఇచ్చిన ట్విస్ట్‌..!

ప్ర‌భాస్ జాత‌కం చూసి పెళ్లి గురించి పండితులు ఏమ‌న్నారో తెలుసా..? ఆ జ్యోతిషుడు ఇచ్చిన ట్విస్ట్‌..!

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ అగ్ర‌హీరో, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్న ఏకైక న‌టుడు ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న సినిమాల బ‌డ్జెట్ అంతా క‌లిపితే దాదాపు రూ.1000 కోట్లకు పైగానే అని చెప్ప‌వ‌చ్చు. ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో ప్ర‌భాస్ పెళ్లి గురించే పెద్ద ఎత్తున చ‌ర్చ కొన‌సాగుతుంది. ముఖ్యంగా ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందా..? అని ఆయ‌న అభిమానుల‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

 

బాహుబ‌లి చిత్రాల త‌రువాత పెళ్లి చేసుకుంటాన‌ని.. ఇంట్లో వాళ్ల‌కు చెప్పిన‌ట్టు గ‌తంలో ప్ర‌భాస్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ త‌రుణంలో తాజాగా మ‌రొక‌సారి ఆయ‌న పెళ్లి విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు ఆచార్య వినోద్‌కుమార్ మాత్రం ప్ర‌భాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా అక్టోబ‌ర్ 2022 నుంచి 2023మ‌ధ్య‌లోనే ఎప్పుడైనా ప్ర‌భాస్ పెళ్లి జ‌ర‌గ‌వ‌చ్చు. ఇది పాన్ ఇండియా స్టార్ విష‌యంలో జ్యోతిష్యం అని చెప్పుకొచ్చారు.

జ్యోతిషుడు వినోద్‌కుమార్ చెప్పిన విధంగానే ప్ర‌భాస్ పెళ్లి జ‌రుగుతుందా..? లేదా అన్న‌ది కాల‌మే నిర్ణ‌యిస్తుంది. మ‌రొక‌వైపు ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ ఈనెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. ఇందులో ఆయ‌న హ‌స్త్రసాముద్రికా నిపుణుడిగా క‌నిపించ‌నున్నారు. పూజాహెగ్దే క‌థానాయిక‌. రాధాకృష్ణ‌కుమార్ తెర‌కెక్కించారు. వీటితో పాటు స‌లార్, ఆదిపురుష్, ప్రాజెక్టు కే చిత్రాలతో పాటు మ‌రొక చిన్న సినిమాలో కూడా న‌టించ‌నున్నారు ప్ర‌భాస్. మ‌రొక వైపు ఇటీవ‌లే ప్ర‌భాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు భార్య శ్యామ‌ల‌దేవి కూడా స్పందించారు.

Also Read :  తెలంగాణ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 91,147 ఉద్యోగాలు ఖాళీలు..!

 

Visitors Are Also Reading