రచిన్ రవీంద్ర ఈ భారత సంతతి కుర్రాడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ప్రాక్టీస్ కి వెళ్తున్న సమయంలో ఓ అభిమాని ఫ్లకార్డును చూపించాడు. ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. ఫ్లకార్డుపై చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. అభిమానిని చూడగానే రచిన్ తన కారును ఆపేశాడు. కారులో నుంచి దిగి అభిమాని దగ్గరకు వెళ్ళాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చారు. దీంతో అభిమాని ప్రేమకు రచిన్ బౌల్డ్ అయ్యాడు అంటూ సీఎస్కే ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కారు దిగి మరి ఆటోగ్రాఫ్ ఇచ్చినందుకు మెచ్చుకుంటున్నారు.
రచిన్ సూపర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ వేలంలో యువ ప్లేయర్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. వేలంలో రచిన్ కోసం ఆరంభం నుంచి తగ్గకుండా బెడ్డింగ్ వేసింది. 50 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన యువ ప్లేయర్ ను ఒక కోటి 80 లక్షలకు సొంతం చేసుకుంది. టాపార్డర్ లో బ్యాటింగ్ తో పాటు బంతితోను రచిన్ రవీంద్ర సేవలు అందించగలరు. తొలిసారి ఈ యువ ప్లేయర్ ఐపిఎల్లో బరిలోకి దిగబోతున్నాడు. ధోని కెప్టెన్సీలో రచిన్ రవీంద్ర ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక వన్డే వరల్డ్ కప్ లో ఈ యువ ప్లేయర్ అద్భుతంగా రాణించాడు. భారత్ గడ్డమీద మెరుపులు మెరిపించాడు. టాపార్డర్ బ్యాటర్ గా అందరి చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. సెంచరీల మోత మోగించాడు. బౌలర్ గాను ఇంపాక్ట్ చూపించాడు. న్యూజిలాండ్ ఫ్యూచర్ స్టార్ గా ప్రశంసలు అందుకున్నాడు.
Advertisement
వన్డే వరల్డ్ కప్ లో రచిన్ రవీంద్ర మొత్తంగా పది మ్యాచుల్లో బరిలోకి దిగాడు. 64.22 యావరేజ్ తో 578 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు కొట్టాడు. వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. 2023 ఎడిషన్ లో నాలుగవ స్థానం దక్కించుకున్నాడు. ఇప్పటివరకు 25 వన్డేల్లో రచిన్ రవీంద్ర బరిలోకి దిగాడు. 820 రన్స్ సాధించాడు. వన్డే కెరీర్ లో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 18 అంతర్జాతీయ టీ20 లు కూడా ఆడాడు. పొట్టి ఫార్మాట్లో గొప్ప రికార్డు ఏమీ లేదు. 13.18 యావరేజ్ తో 148 రన్స్ చేశాడు. 13 అంతర్జాతీయ టి20ల్లో బౌలింగ్ చేసిన రచిన్ రవీంద్ర 11 వికెట్లు సాధించాడు. వన్డేల్లో 18 వికెట్లు దక్కించుకున్నాడు.
Advertisement
https://x.com/CSKFansOfficial/status/1741772279665868949?s=20
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.