సాధారణంగా కొంత మంది డబ్బుల కోసం సినిమాలు చేస్తుంటారు. కొంత మంది ఆసక్తితో సినిమాలు చేస్తుంటారు. కానీ జనం కోసం సినిమాలను తీసే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే కేవలం అద ఆర్.నారాయణమూర్తి అనే చెప్పాలి. ఈయన లాభం ఆశించి ఒక్క సినిమా కూడా చేయడు. తన భావాలను స్పష్టంగా జనాలకు తెలియజేస్తూ.. వారిలో చైతన్యం కలిగించేందుకు సినిమా అనే మాధ్యమం న వాడుకున్నాడు. ప్రధానంగా వెనుకబడిన తరాల వారి గోడును తన సినిమాల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఈయన నటించిన కొన్ని సినిమాలు సంచలన విజయం సాధించగా.. మరికొన్ని అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి.
Advertisement
అయినప్పటికీ ఆర్.నారాయణ మూర్తి సిద్ధాంతం మాత్రం ఇప్పటివరకు వదులుకోలేదు. ఆయన హీరోగా మారే ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ తరువాత ఎర్రసైన్యం సినిమా ద్వారా హీరోగా మారి ఆ సినిమాతోనే దర్శకుడిగా కూడా రాణించాడు. ఎర్రసైన్యం సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కడమే కాదు.. కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా తరువాత ఆయన స్వర్గీయ దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఓరేయ్ రిక్షా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ మూవీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరుసగా సూపర్ హిట్స్ తో ఆర్.నారాయణ మూర్తికి ప్రత్యేక మార్కెట్ ఏర్పడింది. ఆయన హీరోగా దర్శకుడిగా ఎన్నో మంచి సినిమాలను తీశాడు. కమర్షియల్ గా సక్సెస్ అయిందా లేదా అనేది పక్కన పెడతే నమ్మిన సిద్దాంతం కోసం, డబ్బులు సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నా.. నాకు అవసరం లేదు.
Advertisement
మనసుకు నచ్చినట్టే నేను ఉంటాను ధోరణితో ముందుకు సాగిన నారాయణ మూర్తి అంటే ప్రతీ ఒక్కరికీ ఎంతో గౌరవం. చివరగా వెండితెర మీద కనిపించిన సినిమా రైతన్న. ఇదిలా ఉంటే.. ఆర్.నారాయణ మూర్తి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే దానపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించేవి. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణమని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. “ చిన్నప్పుడు నేను ఓ అమ్మాయిని ప్రేమించాను. చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ మా ఇంట్లో ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. మా అమ్మ, నాన్నలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతామని బెదిరించారు. తల్లిదండ్రుల కోసం ఆ అమ్మాయిని వదిలేశాను. అసలే నా జీవితంలో పెళ్లి అనేదే వద్దనుకున్నాను. పెళ్లి చేసుకోకుండా ఎంతో మంది మహానుభావులు లేరా వారిలో నేను కూడా ఒకడగా మిగిలిపోతాను” అంటూ చెప్పుకొచ్చాడు ఆర్.నారాయణమూర్తి. ఆర్.నారాయణమూర్తి ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రెబల్ స్టార్ కి మహిళా లోకం బ్రహ్మరథం పట్టిన సినిమా ఏదో తెలుసా ?
Sudhakar : నేను ఇంకా చనిపోలేదు… బతికే ఉన్నాను