Home » రామ్ గోపాల్‌కు వ‌ర్మ‌కు షాక్ ఇచ్చిన పీవీఆర్‌, ఐనాక్స్..!

రామ్ గోపాల్‌కు వ‌ర్మ‌కు షాక్ ఇచ్చిన పీవీఆర్‌, ఐనాక్స్..!

by Anji
Ad

నిత్యం వివాదస్ప‌ద‌ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రం డేంజ‌ర‌స్‌. తెలుగులో మా ఇష్టం పేరుతో విడుద‌ల‌వుతోంది. అప్స‌ర‌రాణి, నైనా గంగూలి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 08న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. ఇద్ద‌రూ మ‌హిళల మ‌ధ్య సాగే ప్రేమ క‌థ ఈ చిత్రం అని ఇప్ప‌టికే వ‌ర్మ అనేక సార్లు చెప్పాడు. లెస్బియ‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ మ‌ల్టీప్లెక్స్‌లైన పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాలు షాక్ ఇచ్చాయి.


త‌మ థియేట‌ర్లలో ఈ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌కు నిరాక‌రించాయి. ఈ విష‌యాన్ని రామ్‌గోపాల్ వ‌ర్మ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. త‌న సినిమాకు సెన్సార్ బోర్డు అనుమ‌తి ఉన్న విష‌యాన్ని ప్ర‌స్తావించాడు. ఈ రెండు సంస్థ‌లు త‌మ నిర్ణ‌యంతో స్వ‌లింగ సంప‌ర్కుల‌ను అవ‌మానించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Advertisement

Advertisement

Also Read :  100 తీసుకునే నువ్వు న‌న్ను ఎదిరిస్తావా..? కానిస్టేబుల్ పై ఎంఐఎం కార్పోరేట‌ర్ దాదాగిరి..!

పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ నా చిత్రం ఖ‌త్రా లెస్బియ‌న్ ఇతివృత్తంతో తెర‌కెక్క‌డంతో ప్ర‌ద‌ర్శించ‌డానికి నిరాక‌రించారు. సుప్రీంకోర్టు సెక్ష‌న్ 377ని ర‌ద్దు చేసింది. సెన్సార్ బోర్డు ఆమోదించిన త‌రువాత ఈ మూవీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. నేను, LGBT క‌మ్యూనిటీ మాత్ర‌మే కాకుండా PVRcinemas, INOXCINEMAS నిర్వ‌హ‌ణ‌కు వ్య‌తిరేకంగా నిల‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రినీ అభ్య‌ర్థిస్తున్నాను. ఇది మాన‌వ హ‌క్కుల‌ను అవ‌మానించ‌డ‌మే అని వ‌ర్మ ట్వీట్ చేశాడు.

Also Read :  బాల‌కృష్ణ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటూ స్టేజీపైనే ఏడ్చిన ఎన్టీఆర్‌..!

Visitors Are Also Reading