Pushpa Movie Review: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. సుకుమార్ బన్నీతో ఇప్పటికే ఆర్య, ఆర్య-2 లాంటి సినిమాలు చేయడం…రంగస్థలం లాంటి సూపర్ హిట్ తరవాత పుష్పతో ముందుకు రావడంతో ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఈసినిమా టీజర్ ట్రైలర్ ను యూట్యూబ్ ను షేక్ చేశాయి. దాంతో సినిమాపై ఇంకా ఎక్స్పటేషన్స్ పెరిగిపోయాయి. మరి ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన పుష్ప ఆ అంచనాలను రీచ్ అయ్యిందా..? లేదా అన్నది ఇప్పుడు చూద్దాం…
కథ విషయానికి వస్తే..గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. అలాంటి నేపథ్యంలోనే వచ్చినప్పటికీ సుకుమార్ కొత్త కథతో సుకుమార్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ లో కూలీగా పనిచేసే పుష్పరాజ్ తన తెలివితేటలు…ధైర్యంతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలోనే కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో అతడిని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించిన కొండారెడ్డి తన సోదరులకు చుక్కలు ఎలా చూపించాడు…మంగళం శ్రీను ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా సునీల్ కు పుష్పరాజ్ మొగిడిగా ఎలా మారాడు…తనను చిన్ననాటి నుండి అవమానించిన వారికి ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే ఈ సినిమా అసలు కథ.
Advertisement
Advertisement
సినిమాలోకి వెళితే…భారీ పోరట సన్నివేశాలతో పుష్ఫ మాస్ వోల్టేజీ సినిమాగా నిలిచింది. ఓ వైపు భారీ ఫైట్లతో పాటు మధ్య మధ్యలో వచ్చే సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను టచ్ చేస్తాయి. పుష్ఫరాజ్ ఎవరీకింద అయినా తగ్గేదే లే అన్నట్టుగా పనిచేస్తూ దూసుకువెళతాడు. రష్మిక పాలు అమ్ముకునే బీద అమ్మాయి పాత్రలో జీవించింది. ఇక సినిమాలో పుష్పరాజ్ ప్రపోజ్ చేసే సన్నివేశం చిత్రానికే హైలెట్ గా నిలించింది. కొండారెడ్డి పాత్రలో అజయ్ ఘోష్ ఒదిగిపోయాడు. ఎర్రచందనం సిండికేట్ లీడర్ మంగళ శ్రీను గా సునీల్ నటించిన తీరు అబ్బురపరిచేలా ఉంది. దాంతో సునీల్ లోని కమెడియన్ ఒక్కసీన్ లోనూ కనిపించలేదు. ఇక సునీల్ భార్యగా అనసూయగా దక్షగా నటించింది. కానీ అనసూయ పాత్రకు రంగస్థలంలో ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే చెప్పాలి. సినిమాకు మరో హైలెట్..సమంత ఐటెమ్ సాంగ్.
ఇప్పటివరకూ హీరోయిన్ గా నటించిన సమంత మొదటి సారి ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసింది. ఊ అంటావా మామా ఊఊ అంటావా మామా అంటూ కుర్రాళ్లను నిలబడి స్టెప్పులు వేసేలా చేసింది. ఇక ముందు నుండి మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఫహద్ మాత్రం క్లైమాక్స్ దగ్గరపడింది అన్న సమయంలో భన్వర్ సింగ్ షెకావత్ గా తెరపైకి వస్తాడు. ఒక్కటి తక్కువైంది అంటూ ఫహద్ చేసిన యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ లా ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కానీ పుష్ప సెకండ్ పార్ట్ లో మాత్రం ఫహద్ కే ప్రాధాన్యత ఉంటుందని అనుకున్నారు. అంతే కాకుండా ప్రముఖ నటుడు రావు రమేష్ కు కూడా అంత ప్రాధన్యత లభించలేదు.
ఇక సినిమా హైలెట్స్ విషయానికి వస్తే : సుకుమార్ దర్శకత్వం…అల్లు అర్జున్, రష్మిక యాక్టింగ్…. చంద్రబోస్ పాటలు…డీఎస్పీ ఇచ్చిన మ్యూజిక్..మామ్ లక్ష్మన్ పీటర్ హెయిన్స్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. నిర్మాణ విలువల్లో మైత్రీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని స్పష్టంగా కనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే : రన్ టైమ్ ఎక్కువగా ఉండటం..క్లైమాక్స్ ఊహించిన రేంజ్ లో లేకపోవడం.