Home » మ‌హేష్‌బాబుపై సునీల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

మ‌హేష్‌బాబుపై సునీల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

by Bunty
Ad

ఈనెల 17 వ తేదీన రిలీజ‌య్య క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న సినిమా పుష్ప‌. ఈసినిమా ద‌క్షిణాది బాష‌ల‌తో పాటుగా ఉత్తరాదిన హిందీలోనూ రిలీజ‌య్య క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఇందులో పుష్ప‌గా అల్లు అర్జున్ న‌టిస్తే ఎర్రచంద‌నం సిండికేట్ నాయ‌కుడు మంగ‌లం శ్రీనుగా సునీల్ న‌టించారు. విల‌న్ రోల్‌ను సునీల్ అద‌ర‌గొట్టాడు. అయితే, మంగ‌ళం శ్రీను అలియాస్ సునీల్ టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మ‌హేష్‌బాబును గొడ్డుతో పోల్చారు. గొడ్డు అంటే ఇక్క‌డ ఎద్దు అని కాదు. షూటింగ్‌లో గొడ్డు క‌ష్టం చేస్తాడ‌ని అర్ధం. సినిమా అంటే మ‌హేష్‌కు అంత‌టి ప్రాణం అని, ఎంత క‌ష్ట‌మైనా ప‌డ‌తాడ‌ని, గొడ్డు క‌ష్టం చేస్తాడ‌ని అన్నారు. మ‌హేష్ ఒక ద‌ర్శ‌కుడిని న‌మ్మితే ఆయ‌న‌కు త‌ప్ప‌కుండా లైఫ్ ఇస్తాడ‌ని సునీల్ పేర్కొన్నారు. ఫైట్స్ విష‌యంలో ఆయ‌న ప‌డే క‌ష్టం చూస్తే క‌ళ్ల‌వెంట నీళ్లు కార‌తాయ‌ని, డెడికేష‌న్ అంటే అదేన‌ని అన్నారు. ప్రిన్స్ మ‌హేష్‌బాబు జేమ్స్‌బాండ్‌లా క‌నిపించినా, సెట్స్‌లో గొడ్డు క‌ష్టం ప‌డ‌తార‌ని త‌న‌దైన శైలిలో మ‌హేష్ బాబును ఆకాశానికి ఎత్తేశాడు సునీల్‌. పుష్ప సినిమా ది రైజింగ్ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతు రికార్డ్ దిశగా ప‌రుగులు తీస్తున్న‌ది. సెకండ్ పార్ట్ స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.

Advertisement

Visitors Are Also Reading