Home » పుష్ఫ‌-2లో మ‌రో క్రేజీ హీరోయిన్ కు ఛాన్స్…ఎవ‌రంటే..?

పుష్ఫ‌-2లో మ‌రో క్రేజీ హీరోయిన్ కు ఛాన్స్…ఎవ‌రంటే..?

by AJAY
Ad

అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వ‌చ్చిన పుష్ఫ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. తెలుగుతో పాటూ పాన్ ఇండియా లెవ‌ల్ లో ఈ సినిమా విడుద‌లై విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక పుష్ప కు సీక్వెల్ గా పుష్ఫ 2 తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సుకుమార్ ఈ సినిమా కోసం క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టారు. రీసెంట్ గా స్క్రిప్ట్ డిస్క‌ష‌న్ జ‌రుగుతున్న ఓ ఫోటో కూడా నెట్టింట చెక్క‌ర్లు కొడుతోంది.

Advertisement

Advertisement

ఇక పుష్ప 2 పై ఆసక్తిక‌ర వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ సినిమా పార్ట్ 2 లో ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్ గా బ‌న్నీతో త‌ల‌ప‌డ‌బోతున్నాడు అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు మ‌రో విల‌న్ కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పుష్ప పార్ట్ 2 లోవిజ‌య్ సేతుప‌తి కూడా విల‌న్ రోల్ చేయ‌బోతున్నాడు అంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

Priyamani

Priyamani

ఇక ఇప్పుడు మ‌రో వార్త వినిపిస్తోంది. విజ‌య్ సేతుప‌తికి జోడీగా ఈ సినిమాలో ప్రియ‌మ‌ణి న‌టించ‌నుంద‌ట‌. సినిమాలో ప్రియ‌మ‌ణి పాత్రకు కూడా ప్రాధాన్య‌త ఉండ‌బోతుంద‌ట‌. ఇదిలా ఉంటే ప్రియ‌మ‌ణి ప్ర‌స్తుతం పాత్ర‌కు ప్రాధ‌న్య‌త ఉన్న సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా ప్రియ‌మణి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకుంది.

Visitors Are Also Reading