Home » పుష్ప-2 షూటింగ్ ఇక కష్టమేనా..!!

పుష్ప-2 షూటింగ్ ఇక కష్టమేనా..!!

by Sravanthi Pandrala Pandrala

సుకుమార్.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు.. ఆయన ఏ ప్రాజెక్టు చేసిన అందులో ఏదో ఒక కొత్తదనం, ప్రజల్లో ఎన్నో రోజులు తిరగడుతూ ఉంటుంది. ఆ విధంగానే పుష్ప సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించింది. దాని ఫీవర్ మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పవచ్చు. జనాల్లో పుష్ప పుష్ప రాజ్.. తగ్గేదేలే.. అనే డైలాగ్స్ ఇంకా ప్రతి ఒక్కరీ నోట్లో కదలాడుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కూడా ఏప్రిల్ చివర్లో మొదలవుతుందని అన్నారు. కానీ పుష్ప 2 కు పెద్ద సమస్య వచ్చి పడింది.. అది ఏంటో తెలుసుకుందాం..!!

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. అదే స్టేటజీతో పుష్ప2 షూటింగ్ కూడా తొందరగా పూర్తి చేసి మన ముందుకు తీసుకు వస్తారు అనుకున్నాం. కానీ సుకుమార్ ఇంతలో షాకిచ్చారు. ఏప్రిల్ ఎండ్ లోగా పుష్ప2 షూటింగ్ మొదలవుతుందని అనుకున్నాం. కానీ కథలో మార్పులు ఇంకా జరుగుతున్నాయని, తెలుస్తోంది. పుష్ప పార్ట్ వన్ కు వచ్చినటువంటి రెస్పాన్స్ చూసి పుష్ప 2 సినిమాను మరింత

ఆకట్టుకునేలా రడీ చేసేందుకు స్క్రిప్ట్ లో మార్పులు తెచ్చే పనిలో ఉన్నారట సుకుమార్. అందుకోసమే యూఎస్ వెళ్లి ప్రశాంతంగా స్క్రీఫ్ట్ పనులను పూర్తి చేసుకుంటారట. పుష్ప2 సినిమాపై అంచనాల భారం కూడా పెరిగిపోయింది. అందుకే కథలో మార్పులు తీసుకురావడానికి సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే జూన్ నుంచి అసలైన షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

ఇంజనీర్స్ బిర్యానీ మీరు ఎప్పుడైనా తిన్నారా.. ఓ లుక్కేయండి..!!

ఇంజనీర్స్ బిర్యానీ మీరు ఎప్పుడైనా తిన్నారా.. ఓ లుక్కేయండి..!!

చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన 10 మంది సినీతారలు….వారి మృతికి కారణాలు….!

 

Visitors Are Also Reading