Home » లైగర్ కథ ఆ సినిమా కాపీ.. క్లారిటీ ఇచ్చిన పూరీ…!

లైగర్ కథ ఆ సినిమా కాపీ.. క్లారిటీ ఇచ్చిన పూరీ…!

by Azhar
Ad

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల అవుతుంది. అయితే పూరీకి గాని విజయ్ కి గాని ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా అని చెప్పాలి. అయితే వీరు ఈ సినిమాఅను అనౌన్స్ చేసిన వెంటనే.. అంచనాలు అనేవి ఫ్యాన్స్ ఎంతో ఎత్తులో ఏర్పరుచుకున్నారు. ఎందుకంటే మాస్ డైరెక్టర్, మాస్ హీరో కలిస్తే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఫ్యాన్స్ కు తెలుసు.

Advertisement

ఇక ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ అనేది జనాల్లో ఆతృతను ఎక్కువగా పెంచింది. ఇక అదే ఊపులో తాజాగా ఈ సినిమా ట్రైలర్ అనేది విడుదల అయ్యింది. అయితే ఈ లైగర్ ట్రైలర్ వచ్చినప్పటి నుండి ఈ సినిమా కథ చూస్తుంటే అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా గుస్తుకు వస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే రావడంతో ఫ్యాన్స్ ఆ రకమైన కామెంట్స్ అనేవి చేస్తున్నారు. అయితే ఈ లైగర్ తో పటు అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాకు దర్శకుడు పూరీనే అనే విషయం తెలిసిందే.

Advertisement

దాంతో లైగర్ సినిమా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కాపీ అంటూ వస్తున్న వార్తాల పై పూరీ జగన్నాధ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ లైగర్ సినిమా అనేది అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి కాపీ కాదు అని చెప్పాడు. ఈ రెండు సినిమాలు కూడా పూర్తిగా వేరే కథతో తెరకెక్కాయి అని పేర్కొన్నారు. అయితే అప్పుడు రవితేజ హీరోగా వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఆ సినిమాతో ఫ్యాన్స్ పోలుస్తున్న లైగర్ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి మరి.

ఇవి కూడా చదవండి :

చైనా క్రికెట్ ఆడ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

సంజూనే మ్యాచ్ గెలిపించాడు.. రెచ్చిపోతున్న ఫ్యాన్స్..!

Visitors Are Also Reading