Home » పూరి అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఎట్ట‌కేల‌కు ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’పై ప్ర‌క‌ట‌న

పూరి అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఎట్ట‌కేల‌కు ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’పై ప్ర‌క‌ట‌న

by Anji
Ad

టాలీవుడ్ క్రేజీ ద‌ర్శ‌కుల్లో పూరిజ‌గ‌న్నాథ్ ఒక‌రు. పోస్ట‌ర్‌పై ద‌ర్శ‌కుడి పేరు చూసి సినిమాకు వెళ్లే అతికొద్ది మందిలో పూరిజ‌గ‌న్నాథ్ ఒక‌రు. హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో చూపించే పూరితో ఒక్క సినిమా అయినా చేయ‌డానికి హీరోలు సైతం ఎదురు చూస్తున్నార‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఇలాంటి ద‌ర్శ‌కుడు డ్రీమ్ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చితే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా ఫ్యాన్స్‌కు చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రం కోసం పూరి ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తూ ఉన్నారు.

Advertisement

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా పై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయిన‌ప్ప‌టికీ నిత్యం ఏదో ఒక వార్త వైర‌ల్ అవుతూనే ఉన్న‌ది. కాగా తొలిసారిగా ఈ సినిమాపై అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో లైగ‌ర్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. బాక్సింగ్ నేప‌థ్యంలో రానున్న సినిమా షూటింగ్ ఆదివారంతో ముగిసింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ పూరి ఓ ఆమోడియోను విడుద‌ల చేసారు. ఈరోజుతో లైగ‌ర్ షూటింగ్ పూర్తి అయింది. ఇక ఇప్ప‌టి నుంచి జ‌న‌గ‌ణ‌మ‌న అంటూ పూరి చెప్పుకొచ్చారు. ఈ ఆడియోను న‌టి ఛార్మి పోస్ట్ చేసారు. దీంతో పూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌న్న వార్త వారిలో జోష్ ను నింపేసింది.

Advertisement

Also Read :  ఎనిమిదేళ్ల త‌రువాత గూగుల్ లోగో మార్పు..!

ఇదిలా ఉండ‌గా.. ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌నే విష‌యంపై మాత్రం ఇంకా ఎలాంటి స్ప‌ష్ట‌త రాలేదు.తొలుత పూరి ఈ సినిమాను ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో తెర‌కెక్కించుకున్నారు అని వార్త‌లు వినిపించాయి. ఆ త‌ర‌వాత మ‌హేష్ న‌టించ‌నున్నారు అని వార్త‌లు వినిపించాయి. దీనిపై కూడా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఇక తాజాగా వీరిద్ద‌రూ కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా జన‌గ‌ణ‌మ‌న రానున్న‌ద‌నే కొత్త వార్త వినిపిస్తున్నది. ఇంత‌కు ఈ చిత్రంలో హీరోగా ఎవ‌రు న‌ప‌టించ‌నున్నారు అనేది స‌స్పెన్స్‌గా మిగిలింది. ఈ స‌స్పెన్స్‌కు తెర‌ప‌డాలంటే పూరి అధికారికంగా ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి.

Also Read :  ప‌వ‌న్ మ‌రొక సినిమా ఈసారి వైష్ణవ్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌..!

Visitors Are Also Reading