Home » నీ ఫ్యాన్స్ నా విగ్ కూడా పీక‌లేరు.. సుడిగాలి సుధీర్‌పై రెచ్చిపోయిన పంచ్ ప్ర‌సాద్

నీ ఫ్యాన్స్ నా విగ్ కూడా పీక‌లేరు.. సుడిగాలి సుధీర్‌పై రెచ్చిపోయిన పంచ్ ప్ర‌సాద్

by Anji
Ad

శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షో ఈటీవీలో ప్ర‌సారం అవుతూ వారం వారం మంచి రేటింగ్‌ను ద‌క్కించుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తీ వారం విభిన్నమైన కాన్సెప్ట్‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న శ్రీ‌దేవి డ్రామా కంపెనీ బ్యాచ్ న‌వ్వులు పూయించ‌డంతో పాటు సెంటిమెంట్‌తో గుండెల‌ను క‌రిగిస్తారు. అద్భుత‌మైన ఈ షోకు సుధీర్ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిన‌దే. ఈ షో ఈటీవీ స్థాయిని మ‌రొక ప‌ది రెట్లు పెంచుతుందంటూ ప్రేక్ష‌కులు పేర్కొంటున్నారు. వ‌చ్చే ఆదివారం ఎపిసోడ్ విష‌యానికి వ‌స్తే.. అలీబాబా 25.5 దొంగ‌లు అనే కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

Sudheer-Prasad

Sudheer-Prasad

తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ప్ర‌తివారం ఒక గెస్ట్ వ‌చ్చినట్టుగానే వ‌చ్చే వారం ఎపిసోడ్‌కు సీనియ‌ర్ హీరో అప్ప‌ట్లో అమ్మాయిల్లో మంచి క్రేజ్ ద‌క్కించుకున్న వెంక‌ట్ సంద‌డి చేయ‌బోతున్నారు. ప్ర‌తి వారం మాదిరిగానే సుధీర్ త‌న దైన శైలిలో ఈ ఎపిసోడ్‌లో ఆక‌ట్టుకోబోతున్న‌ట్టుగా ప్రోమోలో క‌నిపిస్తోంది. అలీబాబా దొంగ‌ల ముఠా నాయ‌కుడిగా సుధీర్ క‌నిపించ‌బోతున్న ఆయ‌న గెట‌ప్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. సాధార‌ణంగా సుధీర్‌పై పంచ్‌లు వేయాలంటే ఆయ‌న‌ను తిట్టాలంటే క‌మెడియ‌న్స్ భ‌య‌ప‌డుతుంటారు.

Advertisement

Advertisement

Also Read :  టైటిల్ ద‌గ్గ‌ర నుండి “పోకిరి” క‌థ‌లో మ‌హేశ్ బాబు చేసిన మార్పులు ఇవే..!

కానీ ఈ ఎపిసోడ్‌లో పంచ్ ప్ర‌సాద్ ఓ రేంజ్‌లో సుధీర్‌ను ఏకి పారేశారు. ప్ర‌సాద్ ఏదో పంచ్ వేస్తే దానికి సుధీర్ అడ్డుప‌డ‌టంతో అత‌డు చాలా హ‌ర్ట్ అయిన‌ట్టు క‌నిపించింది. ప్ర‌సాద్ సీరియ‌స్‌గా ఏమి చేసుకుంటావో చేసుకో ఈ రోజు నిన్ను ఏకి పారేస్తాను.. నీ ఫ్యాన్స్ నా విగ్ కూడా పీక‌లేరంటూ త‌న త‌ల‌పై ఉన్న విగ్‌ను పీకి అవ‌త‌ల పారేశాడు. కేవ‌లం కామెడీ కోసం మాత్రమే ఇది జ‌రిగి ఉంటుంది. కానీ సుధీర్ అభిమానులు హ‌ర్ట్ అయి ఉంటార‌ని కొంద‌రూ అభిప్రాయ ప‌డుతున్నారు. ప్ర‌సాద్ ను క‌చ్చితంగా కామెంట్స్ రూపంలో సుధీర్ ఫ్యాన్స్ ఏకి పారేసే అవ‌కాశాలున్నాయి. పంచ్ ప్ర‌సాద్ రెడి అయ్యే సుడిగాలి సుధీర్‌పై అలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉంటాడు. ఫ్యాన్స్‌ను కూడా తిట్టి ఉంటాడంటూ కొంద‌రూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో ఏమి చేసినా కామెడీ కోస‌మే.. ఏమి చూపించినా కామెడీ కోస‌మే అనే విష‌యాన్ని అంద‌రూ గుర్తించుకోవాల‌ని ఆశిద్దాం.

Also Read :  క‌చ్చా బాదం సాంగ్ కు అల్లుఅర్జున్ కూతురు డ్యాన్స్‌..!

Visitors Are Also Reading