Home » అయోధ్యలో శ్రీరాములోరి రాక సమయాన, స్మరించుకోవాల్సిన ఓ మంచి వ్యక్తి పుల్లారెడ్డి గారు.. ఎందుకంటే?

అయోధ్యలో శ్రీరాములోరి రాక సమయాన, స్మరించుకోవాల్సిన ఓ మంచి వ్యక్తి పుల్లారెడ్డి గారు.. ఎందుకంటే?

by Srilakshmi Bharathi
Ad

నేడు అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరాములోరి విగ్రహ ప్రతిష్టాపన వేడుక జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దిగ్విజయంగా నిర్వర్తించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ ఉత్సవం గురించే చర్చలు జరుగుతున్నాయి. అయితే.. ఈ సందర్భంలో మనం పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి గారిని కచ్చితంగా స్మరించుకోవాలి. ఆయన అయోధ్య ఉద్యమ సమయంలో ఆర్ధికంగా చాలా సహాయం చేసారు. కేవలం అయోధ్య కోసమే కాకుండా.. ఆయన ఎన్నో గుప్తదానాలు చేసారు. హిందూ ధర్మ అభివృద్ధికి పాటు పడ్డారు. అయోధ్య ఆలయం కోసం పుల్లారెడ్డి గారు ఎటువంటి సహాయం చేసారో ఇప్పుడు చూద్దాం.

Pullareddy-G

Advertisement

 

అయోధ్య లో రాముల వారి ఆలయానికి మోడీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. చాలా వరకు నిధులు ఆలయానికి వచ్చిన విరాళాల ద్వారానే పోగయ్యాయి. దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విరాళాలుగా అయోధ్యలోని రాముల వారికి అందాయి. ఆ విరాళాల్లోనే ఇప్పటివరకు పద్దెనిమిది వందల కోట్లను ఖర్చు చేసి ఆలయ నిర్మాణ పనులను చేపట్టారు. అయితే.. మిగతా నిధులను రామ జన్మ భూమి ట్రస్ట్ కు అప్పగించారు.

Advertisement

అయితే.. ఆలయ నిర్మాణ సమయంలోనే కాకుండా.. ఆలయం కోసం పోరాటం జరిగిన సమయంలో కూడా ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో విశ్వహిందూ పరిషత్ కోశాధికారిగా పుల్లారెడ్డి ఉన్నారు. అయోధ్యలో రామ మందిరం కోసం విశ్వ హిందూ పరిషత్ తీవ్ర స్థాయిలో కృషి చేసిందన్న సంగతి తెలిసిందే. అయితే.. పుల్లారెడ్డి గారు కోశాధికారిగా ఉన్న సమయంలో తన సొంత డబ్బుని చాలానే ఖర్చు చేసారు. ఈ విషయాలను అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ వెల్లడించారు. కోర్టు ఖర్చుల కోసం పాతిక లక్షలు అవసరం అయితే.. పుల్లారెడ్డి అప్పటికప్పుడు రెండు లక్షలను ఇచ్చేసారు. ఆ రోజు సాయంత్రం లోపే తనకు తెలిసిన వారి వద్ద తీసుకుని మరో పది లక్షలను కూడా ఇచ్చారు. ఇల్లు అమ్మడానికైనా, భార్య నగలను తాకట్టు పెట్టడానికైనా తాను సిద్ధమేనని పుల్లారెడ్డి ముందుకొచ్చారు. ఆయన మరణించిన తరువాత సంతాప సభలో అశోక్ సింఘాల్ ఈ విషయాలను వెల్లడించి బాధపడ్డారు. ఇవి కాకుండా ఆయన చేసిన గుప్త దానాలు చాలానే ఉన్నాయి. సంఘ పరివార్ సంస్థలకు పెద్ద దిక్కుగా నిలిచిన పుల్లారెడ్డి, అబిడ్స్‌లో ఇస్కాన్ టెంపుల్ కోసం 950 గజాలని విరాళంగా ఇచ్చేసారు. ఎప్పటికైనా రామ మందిర నిర్మాణం జరుగుతుందనే నమ్మకంతోనే ఆయన తుదిశ్వాస విడిచారు. నేడు ఆయన కల నెరవేరింది. కానీ చూడడానికి ఆయన భౌతికంగా మన మధ్య లేరు.

Visitors Are Also Reading